కొవిడ్-19 కారణంగా చాలా కాలం నుండి ఉపాధ్యాయులకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతోంది.
అలాగే ప్రస్తుతం కూడా 50% ఉపాధ్యాయులు ప్రతిరోజు హాజరయ్యేలా నిబంధనలు జారీ చేయడం జరిగింది.
అయితే పాఠశాలల సందర్శన సమయంలో గమనించింది ఏమనగా, కొవిడ్-19 కాలంలో మినహాయింపు పొందుతున్నటువంటి ఉపాధ్యాయుల హాజరు పట్టిక నందు ఎటువంటి నమోదు లేకుండా ఖాళీగా వదిలివేయటం జరుగుతున్నది.
ప్రతిరోజు నిర్దిష్ట సమయం తర్వాత హాజరు పట్టికనందు సంతకంగాని, సెలవుగాని లేదా గైర్హాజరుగాని ఖచ్చితంగా నమోదు చేయబడాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ హాజరు పట్టికనందు ఖాళీలు ఉంచరాదు.
కావున కొవిడ్-19 కాలంలో విధుల నుండి మినహాయింపు పొందిన మరియు పొందుతున్న ఉపాధ్యాయులకు హాజరు పట్టిక నందు "Ex" అను మార్కును నమోదు చేయవలసిందిగాను, ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్దేశిత సమయం తర్వాత హాజరు పట్టికనందు ఖాళీలు ఉండకుండా చూడవలసిందిగాను అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమైనది.
(Ex = Exempted)
నిర్దేశిత సమయం తర్వాత ఖాళీగా ఉన్న హాజరు పట్టికను క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించి, తగిన చర్యలు తీసుకొనబడునని తెలియజేయడమైనది.
మండల, ఉప మరియు జిల్లా విద్యాశాఖ అధికారులు అందరూ ఈ విషయమై అన్ని పాఠశాలలకు తక్షణమే తగిన సూచనలు జారీ చేయవలసినదిగా మరియు అతిక్రమించిన బాధ్యులపై తగిన చర్యలు తీసుకొనవలసినదిగా కోరడమైనది.
ప్రాంతీయ సంయుక్త సంచాలకులు,
జోన్-2, కాకినాడ.
0 comments:
Post a Comment