* గుంటూరు జిల్లాలో బదిలీ ప్రక్రియ ప్రారంభం
*29.2-2020 తర్వాత రోల్ పెరిగిన పాఠశాలల గురించి వివరణ
శ్రీయుత సంచాలకులు, పాఠశాల విద్య, అమరావతి వారు బదిలీలు, పోస్ట సర్దుబాటు మరియు పదోన్నతుల షెడ్యూలు మరియు సూచనలు ప్రకటించినారు. ఈ సందర్భముగా జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు వారు శ్రీమతి ఆర్.ఎస్.గంగా భవాని గారు జిల్లాలోని అందరూ ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు షెడ్యూలు మరియు సూచనలు ప్రకారము నిర్ణీత ప్రొఫార్మాలలో అన్ని రకాల ఖాళీలను మరియు తప్పనిసరిగా బదిలీ అగు ఉపాధ్యాయ వివరములను సేకరించవలెనని కోరినారు. ఇందుకోసం వారు విషయ పరిజ్ఞానము ఉన్న వారితో కమిటీలను ఏర్పరచుకొని సమాచారమును పరిశీలించి మరియు ధృవీకరించి ఈ కార్యాలయమునకు సమర్పించవలసినదిగా కోరినారు.పోస్టుల సర్దుబాటుకు ది.29-2-2020నాటి విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా తీసుకొనడమైనది. ఈ విషయంలో ది.14-10-2020 నాటికి విద్యార్థుల సంఖ్యలో ఏమైనా పెరుగదల ఉన్నచో సంబంధిత ప్రధానోపాధ్యాయులు వారి తనిఖీ అధికారులద్వారా వివరములు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు ది.19-10-2020 లోపు సమర్పించవలెనని తెల్పినారు.పేరెంట్ మేనేజ్ మెంట్ లోకి బదిలీలు కోరుకొనే ఉపాద్యాయులు కూడాసంబంధిత తనిఖీ అధికారులద్వారా వివరములను జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు సమర్పించవలెనని తెల్పినారు.
0 comments:
Post a Comment