దసరా లోపు పి.ఆర్.సి అమలు చేయాలి : ఎపి జెఎసి డిమాండ్
రాష్ట్రంలోని 8 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన 11వ నూతన వేతన సవరణ (పిఆర్ సి)ని ది.01-7-2018 నుండి అమలు చేయాలని ఎపిజెఎసి ఛైర్మన్, సెక్రటరీ జనరల్ఎన్.చంద్రశేఖర్ రెడ్డి, నిహెచ్.జోసఫ్ సుధీర్ బాబులు డిమాండ్ చేశారు. ది. 6-10-20న ఆంధ్రప్రదేశ్ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యచరణ సమితి (ఎపి జెఎసి) సెక్రటేరియేట్ సమావేశం ఎపిజెఎసి ఛైర్మన్ ఎన్.చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగినది. సభ్య సంఘాలు సుదీర్ఘంగా పెండింగ్ సమస్యలపై చర్చించటం జరిగింది. 11వ పిఆర్ సి నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన దరిమిలా తక్షణమే నివేదిక అంశాలను బహిర్గతం చేసి ఫిట్ మెంట్ ను 55% ఇవ్వాలని, ఆటోమెటిక్ అడ్వాన్స్ మెంట్ స్కీమ్ 5,10,15,20,25 సం||లకు వర్తింపుజేయాలని, కనిష్టవేతనం, గ్రాట్యూటీ తదితర అంశాలన్నీ ఎపిజెఎసి ఇచ్చిన ప్రతిపాదనల మేరకు వుండాలని ప్రభుత్వాన్ని కోరారు. పిఆర్ సికి అనుబంధంగా వుండే పెండింగ్ డి.ఎ.లను మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రిగారు ఇచ్చిన హామీ మేరకు 1.86 లక్షల మందికి సంబంధించిన సిపిఎసన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. ఉద్యోగి ఖాతాలు జడ్ పిపిఎఫ్/జిపిఎఫ్, ఎపిజిఎ లోన్స్ దరఖాస్తు చేసుకొన్నప్పటికి నెలల తరబడి మంజూరు కావడం లేదని, పదవీ విరమణ చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయుల అన్ని రకాల బెనిఫిట్స్ ను తక్షణమే మంజూరు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఇహెచ్ఎస్ కార్డ్స్ ద్వారా ఖచ్చితంగా కార్పోరేట్ / ప్రైవేట్ ఆసుపత్రులుచికిత్సలు అందించాలని, మెడికల్ రీయింబర్స్ మెంట్ సౌకర్యాన్ని కొనసాగించాలని కోరారు.
కోవిడ్ విధులనుసక్రమంగా నిర్వర్తిస్తున్న ఉద్యోగులను జిల్లా ఉన్నతాధికారులు ఇబ్బందులకు గురి చేస్తే ఎపిజెఎసిఉద్యమిస్తుందన్నారు. ఎపిజెఎసి డిమాండ్లను నెలాఖరులోపు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ఎపిజెఎసి సమావేశంలో ఛైర్మన్, సెక్రటరీ జనరల్ లతో పాటు కో-చైర్మన్లు పి.పాండురంగ వరప్రసాద్ట .హృదయరాజు,గోపాలకృష్ణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్ బండి శ్రీనివాసరావు, వైస్ ఛైర్మన్ మణి కుమార్, అసిస్టెంట్ సెక్రటరీజనరల్స్ ఆహ్మద్ ఇక్బాల్, ఆర్.ఎస్.హరనాధ్, పబ్లిసిటీ సెక్రటరీ సిహెచ్. అజయ్ కుమార్, సెక్రటరీలు శ్రీనివాసులు,రామారావు, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సోమేశ్వరరావు, నర్సింగ్ అసోసియేషన్ పద్మజా తదితరులుపాల్గొన్నారు.
0 comments:
Post a Comment