ది 27/10/2020 తేదీన పాఠశాల విద్యాశాఖ కార్యాలయం నందు ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వంతో కమీషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు కింది సమస్యల పరిష్కారం కోసం సానుకూలంగా స్పందించారు. చర్చల్లో రాష్ట్ర ఛైర్మస్ జి వి నారాయణ రెడ్డి, సెక్రటరీ జనరల్ కొణతం నరహరి, కో- చైర్మన్లు షేక్ సాబీ, ఎం రఘునాథ రెడ్డి, కె వెంకటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు, పి పాండురంగ వరప్రసాద్, వి శ్రీనివాసరావు పాల్గొన్నారు. చిత్తూరు గ్రాడ్యుయేట్ MLC (PDF) యండపల్లి శ్రీనివాసులురెడ్డి చర్చల్లో పాల్గొన్నారు.
1) రీ అపోర్షస్ మెంట్ ( రేషనలైజేషన్ ) కొరకు షెడ్యూలు రివైజ్ చేసి చైల్డ్ ఇన్ఫో అప్ డేట్ చేయుటకు అక్టోబర్ 31 వరకు ప్రయివేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల పేరెంట్స్ డిక్లరేషన్ స్వీకరించి MEO లు చైల్డ్ ఇఫోను అప్ డేట్ చేసి ఫిబ్రవరి 29 లేదా అక్టోబరు 31 లలో ఏది ఎక్కువైతే దాన్ని పరిగణించాలి.
2) SGT లకు సంబంధించి వెబ్ కౌన్సెలింగ్ పై అక్టోబర్ 10 లోపు డెమో నిర్వహించి ఎదురయ్యే సమస్యల్ని గుర్తించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
3) పర్వత ప్రాంతాలను కేటగిరి 4 గా ఉత్తర్వులు ఇస్తారు.
4) ప్రధానోపాధ్యాయులు కు 5 పూర్తి సంవత్సరాలుగా పరిగణించారు.
5) కేడర్ వైజై బదిలీలు పదోన్నతులకు అంగీకరించారు. మి గిలిన అంశాలు ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మరియు మంత్రి గారితో ఫ్యాప్టో ఈ రోజు,రేపటిలో చర్చిస్తుంది.
0 comments:
Post a Comment