* ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు
పాఠశాల విద్యా శాఖ ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టడానికి ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసినదే. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాష్ట్రంలో గుర్తింపు పొందిన మరియు గుర్తింపు పొందని సంఘాలతో పాఠశాల విద్యా శాఖ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం 16.10.20 న ఉదయం 11 గంటలకు ఇబ్రహీంపట్నం లోని పాఠశాల విద్యాశాఖ కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహించబడును అని పాఠశాల విద్యా సంచాలకులు తెలియజేశారు. ఈ సమావేశానికి హాజరయ్యే ఉపాధ్యాయ సంఘ నాయకులకు బదిలీల మీద ఏమైనా సలహాలు గానీ ఫిర్యాదులు గానీ ఇవ్వాల్సి ఉంటే తీసుకురావాల్సిందిగా తెలియజేశారు ట్రాన్స్ఫర్లు సజావుగా జరగడానికి సంఘాలన్నీ సహకరించాలని కోరారు.
0 comments:
Post a Comment