జగనన్న విద్యాకానుక పంపిణీ పై పలువురు ప్రధానోపాధ్యాయుల సందేహాలకు సమాధానాలు:
అందరు మండల విద్యాధికారుల ద్వారా అందరు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది..
*1)జగనన్న విద్యాకానుకలను ఎవరికి ఇవ్వాలి?*
జ)జగనన్న విద్యాకానుకలను 2019-20 విద్యాసంవత్సరం యొక్క రోలు ఆధారంగా ఇవ్వడం జరిగినది.కానీ మనం ప్రస్తుతం అనగా 2020-2021 విద్యాసంవత్సరంలో (ప్రస్తుతం) ఉన్న *అన్ని తరగతుల విద్యార్థులకు*ఇవ్వవలెను.అనగా ఈ సంవత్సరం *పాఠశాలలో ఉన్న ప్రస్తుత విద్యార్థులకు మాత్రమే* ఇవ్వవలెను.
PS లో 5th పాసయి వెళ్ళిపోయినవారికి, UP లో 8th పాసయి వెళ్ళిపోయినవారికి, HS లో 10th పాసయి బయటకు వెళ్ళిపోయిన వారికి ఇవ్వరాదు.ఒకవేళ పాఠశాల తరగతులలో రోలు అధికంగా ఉన్నట్లయితే ముందు జాయిన్ అయనవారికి ఇచ్చి లేటుగా జాయిన్ అయిన వారికి ఆపవలెను.మిగిలిన విద్యార్థులకు రెండవ విడత వచ్చినప్పుడు ఇవ్వవచ్చు.
ఉదా: ఒక పాఠశాల/తరగతిలో 2019-20 రోలు 60 మంది ఇప్పుడు 70 మంది ఉన్నారనుకుంటే ఆ70 మందిలో ముందుగా జాయిన్ అయినవారికి 60 మందికి ఇవ్వాలి.మిగిలిన 10 మందికి రెండవ విడత వచ్చినపుడు ఇస్తాము.ఆవిధంగా పాఠశాలలో పంపిణీ చేయగలరు.
CMO-SS-EGDT
0 comments:
Post a Comment