ది 16/10/2020 ఉదయం పాఠశాల విద్యా కమిషనర్ వారు ఉపాధ్యాయ సంఘాలతో రేషనలైజేషన్,బదిలీల్లో లేవనెత్తిన అంశాలపై చర్చ జరిపారు.
ప్రధానంగా కింది సమస్యలు చర్చకు వచ్చాయి:
1) ప్రాథమిక పాఠశాలల రేషనలైజేషన్ విషయం లో ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.
2) SGT లకు WEB Counseling కాకుండా Online Counseling జరపాలనే ప్రతిపాదనకు సానుకూలం.
3) వేకెన్సీలు బ్లాక్ చేయకుండా అన్నీ ఓపెన్ చేయడాని సానుకూలత వచ్చింది.
4) 2019 జూస్ నుండి పదోన్నతులు, అప్ గ్రేడేషన్ ద్వారా నింపిన అన్నింటినీ ఖాళీలుగా చూపాలనే డిమాండ్ ప్రభుత్వానికి తెలుపుతామున్నారు.
5) పదోన్నతులు ముందు కల్పించినా నష్టం జరగకుండా చూస్తామన్నారు.
6) పదవీ విరమణ కు 3 ఏళ్ళ లోపు సర్వీసు ఉన్న వారిని పరిగణలోకి తీసుకోవడానికి అంగీకరించారు.
7) థర్డ్ మెథడాజీ వారికి పదోన్నతుల్లో అవకాశం కల్పించారు. జీవో రాబోతుంది. ఎం ఏ తెలుగు విషయం కోర్టు లో ఉన్నందున వారి సమస్య పరిష్కారం కాలేదు.
8) సర్వీస్ పాయింట్లు 1 గా మార్చడానికి సానుకూలంగా స్పందించలేదు.
9)ఖాళీలు - బ్లాక్ చేయకుండా ఉండడానికి అంగీకారం
10)పాఠశాల రోల్ 14.10.2020 చైల్డ్ ఇన్ఫోలో వున్న ఇబ్బందులు దృష్ట్యా భౌతిక పరశీలన ద్వారా అనుమతి ఇస్తామని అన్నారు.
12)ప్రాథమిక పాఠశాలలు రేషనలైజేషన్ 1:20 సాధ్యం కాదని, 34,000 పాఠశాలలకు 76,000 పోస్టు మాత్రమే వున్నందున సాధ్యం కాదని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని కమీషనర్ తెలియజేశారు.
0 comments:
Post a Comment