Provident Fund PF Complete Details...

Provident Fund PF Complete Details... provident Fund PF Scheme , How to Enroll in PF , Withdrawal PF Complete Details

ఒక సంవత్సరము సర్వీసు గల ప్రభుత్వ, సంచాయితీరాజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు జిపిఎఫ్ చందాదార్లు అగుటకు అర్హులు. పంచాయితీరాజ్ ఉపాధ్యాయులు ప్రొసిడెంట్ ఫండ్ (11,07, 1981 నుండి "జనరల్ ప్రావిడెంట్ ఫండ్"గా మార్చ బడినది. జిపిఎఫ్ ఖాతా దార్లు క్రింది విధంగా నెలసరి చందా చెల్లించాలి.



Provident Fund PF Complete Details...

వడ్డీ : జిపిఎఫ్ నిల్వలపై 01.04.1984 నుండి 10 శాతం చొప్పున, 01.04.1985 నుండి 10 శాతం చొప్పున, 01.04.1986 నుండి 12 శాతం చొప్పున 01.04.2000 నుండి 11% చొప్పున, 01.04.2001 నుండి 9.5%, 01.04.2002 నుండి 9% చొప్పున, 01.04.2003 నుండి 8% చొప్పునను వడ్డీ చెల్లించబడుతుంది.

చందా నిలుపుదల : పదవీ విరమణకు ముందున్న 4 మాసములకు చందా నిలుపు చేయబడుతుంది. ఇది ఐచ్ఛికము గాదు, నిర్బంధము. ఈకాలంలో అడ్వాన్సు మంజూరుగాని, అడ్వాన్సు వాయిదాల చెల్లింపుగాని అనుమతించబడవు.

అడ్వాన్సు : జిపిఎఫ్ నిల్వ నుండి ఈ క్రింది కారణాలపై అడ్వాన్సు పొందవచ్చును. ఈ తాత్కాలిక అడ్వాన్సు కనీసంగా ₹ 500గాని, మూడు నెలల వేతనము (పే)నకు మించని మొత్తంగాని ఇస్తారు. అయితే ఇది నిల్వలో సగం మొత్తాన్ని మించరాదు.

1. చందాదారునికి లేక అతనిపై ఆధారపడిన వారికి దీర్ఘకాలిక వ్యాధి సంభవించినప్పుడు, 

2 సెకండరీ విద్యకంటే పై స్థాయి విద్య ఇతర దేశాలలో చదువుటకు, 

3. మన దేశంలో 3 సంవత్సరాలకంటే మించిన ఉన్నత విద్యా కోర్సులు చదువుటకు, 

4. ఉద్యోగి హోదానుబట్టి ఆచార సంబంధమైన వివాహము, కర్మ, ఉపనయనము, జన్మదినోత్సవాలు నిర్వహించుకొనుటకు, 

5. తన విధి నిర్వహణలో ఎదురైన కోర్టు ఖర్చులు భరించుటకు.

రికవరీ : ఈ అడ్వాన్సును, అభ్యర్థి కోరుకుంటే కనీసం 6 వాయిదాలకు తగ్గకుండాను లేవి యెడల 24 వాయిదాలకు మించకుండాను వసూలు చేస్తారు. అర్థజీతం కంటే తక్కువ వేతనం పొందే సెలవులలోను, సబ్సీ స్టెన్సు పొందే కాలంలోను ఈ రికవరీలు చేయరు. చివరి వాయిదా తీరకముందే మరల అడ్వాన్సు మంజూరు చేయవచ్చు. బకాయి మొత్తం కూడా కొత్త అడ్వాన్సుతో కలిపి వాయిదాలను నిర్ణయించి వసూలు చేస్తారు.

పాక్షిక ఉపసంహరణ : 20 సం||ల 'సర్వీసు కాలముగాని, రిటైర్మెంట్ గాని, రిటైర్మెంటుకు 10 సం||లు ముందుగాని ఏదిముందు అయితే దానిననుసరించి ఈ నిబంధన క్రిందసొమ్ము పొందవచ్చు. దానికి ఈ క్రింది కారణాలుండాలి. '

1. తనపై ఆధారపడిన పిల్లల ఉన్నత విద్యాభ్యాసనమునకు (కళాశాల స్థాయి విద్య), 

2.పిల్లల పెండ్లి, ఉపనయనము మొదలగు వానికి,

3. ఇంటి నిర్మాణము, రిపేర్లు, స్థలం కొనుగోలు నిమిత్తం, లేదా వానికయిన అప్పులు తీర్చుటకు, 4. వైద్య చికిత్స కొరకు.పై కారణాలకు నిల్వ ఉన్న సొమ్ములో సగానికి మించకుండా, మూడు నెలల జీతమునకు తగ్గకుండా కారణములనుబట్టి 3 నెలలు,6 నెలలు, 10 నెలలు ఉత్తము వరకు మంజూరు చేయవచ్చు. ప్రతి కారణమునకు వేర్వేరు మొత్తాలు నిర్ణయించబడినవి.పూర్తి చెల్లింపు ఉద్యోగి సర్వీసు నుండి వైదొలిగినా, తొలగించబడినా, పదవీ విరమణ చేసినా జిపిఎఫ్ నిల్వ సొమ్ము పూర్తిగా చెల్లించబడుతుంది.

నామినేషన్ : ఉద్యోగి. సర్వీస్ లో వుండగానే విధిగాతన మరణానంతరం జిపిఎఫ్ సొమ్ము ఎవరెవరికి ఎంతెంత మొత్తం చెందవలెనో ఒకరికిగాని అంతుకుమించిగానీ-నామినేషన్ యివ్వాలి. పాత నామినేషన్‌ను రద్దు చేసుకుంటూ, తాజా నామినేషన్‌ను ఎప్పుడైనా ఇవ్వవచ్చు. 

నామినేషన్ఇవ్వకుండా చనిపోతే వారసత్వ హక్కుగల కుటుంది సభ్యులకు సమాన భాగాలలో చెల్లిస్తారు.

నిర్వహణ : పంచాయితీరాజ్ పాఠశాలల ఉపాధ్యాయుల ఈ నిధిని జిల్లా పరిషత్ ఆధ్వర్యంలోనే ఉంచారు. తాత్కాలిక అడ్వాన్సులు, పాక్షిక ఉపసంహరణలు అన్నీ వారే చూస్తారు. అయితే వాటిని మంజూరు చేసే అధికారం హెడ్మాష్టర్లకు దఖలు పరచబడింది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల ఈ నిధి ఏటి, ఆధ్వర్యంలో వుంటుంది...

బూస్టర్ స్కీము : ఉద్యోగి చనిపోవుటకు ముందున్న 3 సం||ల కాలములో పిఎఫ్ సర్వాత్తి నిల్వకు సమానమైన మొత్తం (R 20వేలకు మించకుండా)చెల్లించబడుతుంది. కనిష్ఠ సరాసరి నిల్వ మొత్తం గజిటెడ్ వారైతే ₹ 4,000లు, నాన్ గజిటెడ్ ₹3000 లాస్ట్ గ్రేడ్ వారైతే ( 1000లు వుండాలి. 5 సం||ల కనిష్ఠ సర్వీసు వున్నవారే అర్హులు, ఈ సదుపాయము పంచాయితీరాజ్ ఉపాధ్యాయులకు కూడా వర్తింపచేయబడినది. జిఓ ఎంఎస్నం. 386 పిఆర్; తేది. 17.09, 1996 ప్రకారం ఉద్యోగి మరణించగానే పైన తెలిపిన నిబంధనల ప్రకారం హెగ్డ 8338 నుండి డ్రా చేసి వారసులకు చెల్లించాలి. ఆర్థిక సంవత్సరం చివరిలో ఇలాంటి మొత్తములన్నింటిని కలిపి హెచ్ 2295 నుండి డ్రా చేసి రీయింబర్స్ చేయాలి.

గమనిక : 01.09.2004 తదుపరి నియామకము పొందువారికి ఈ జీపీఎఫ్ నిబంధనలు వర్తించవు,కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మాత్రమేవర్తిస్తుంది.

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top