పాఠశాలల్లో రేషనలైజేషన్ చేయుటకు 29.2.20 తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు యిచ్చింది. కరోనా, అమ్మఒడి, నాదునేడు పాఠశాలల మౌలిక వసతులు పెరుగుదల, పౌష్టికాహారం నేపధ్యంలోఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృషిచేసినచోట ఎల్మెంట్ బాగా పెరిగిన పాఠశాలలు ఉన్నాయి.ప్రభుత్వ పాఠశాలలు ఎన్రోల్మెంట్ కు సంబందించి చైల్డ్ ఇన్ఫో వివరాల్లో తేడాలు ఉన్నాయి. చైల్డ్ ఇన్ఫోఅప్ లోడ్ చేసే యూజర్ నేమ్ పాస్ వార్డు ప్రైవేటు పాఠశాలల యాజామాన్యాలకు ఇవ్వడం వలన, ప్రైవేటు పాఠశాలలనుంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన సందర్భంలో ప్రైవేట్ పాఠశాలలు ఎన్రోల్మెంట్ నుండి డిలీట్చేయడం లేదు. దీనివలన ప్రభుత్వ పాఠశాలల్లో చేరినప్పటికీ ఫిజికల్ ఎలిమెంట్ కు, చైల్డ్ ఇన్ఫోకు వ్యత్యాసం కనబడుతుంది.
పాఠశాల విద్య కమీషనర్ 17.9.20న విడుదల చేసిన లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2,47,151మంది ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరగా, 1,06,503 మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలనుండి ప్రైవేటు పాఠశాలల్లో నమోదు కాబడినట్లు పేర్కొన్నారు. ఎల్మేంట్ ప్రక్రియ పూర్తి కాకున్నా లక్షానలభైవేలమంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు లెక్కలు సూచిస్తున్నాయి.
కావున ప్రస్తుత రేషనలైజేషన్ చేసే సందర్భంలో బాగా ఎస్ కోల్ మెంట్ పెరిగిన పాఠశాలల నుండి పోస్టులుత రలించవద్దని విజ్ఞప్తి చేశారు
0 comments:
Post a Comment