నూతన ఉపాధ్యాయులకు మార్గదర్శకాలు
1.యన్.జి.టి. కేడర్లకు ప్రారంభ వేతనం రూ. 21,230/- + డి.ఎ.- 27.248% + H.R.A. 12% or 14. 5 లేదా 20% లేదా 30% స్కూల్ అసిస్టెంట్ కేడర్ల ప్రారంభ వేతనం రూ. 28,940/- + డి.ఎ.- 27% + H.R.A. 12% లేదా 14.5 లేదా 20%లేదా 30% డి.యన్.సి. సెలక్షన్స్ మెంట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ నిర్ణయించబడును.
2. పాఠశాల విధుల్లో చేరేముందు విద్యార్హతల అన్ని దృవపత్రాలు, కులదృవీకరణ పత్రాలు సంబంధిత హెచ్.యం, యం. ఈ.ఓ.లకు విధిగా సమర్పించాలి.
3. సేవాపుస్తకమును యం. ఈ. ఓ.హెచ్.యం. గారిచే ప్రారంభించుకొనవలెను. ఇందులో మీ విద్యార్హతలు, గ్రామము, మండలం, జిల్లా పుట్టినతేది, పుట్టుమచ్చలు మరియు నియామక ఉత్తర్వుల్లోని మెరిట్ ర్యాంక్, హాల్ టికెట్ నెం, అపాయింటింగ్ అథారిటి ప్రొసీడింగ్ నెం. పాఠశాలల్లో చేంన తేదీ, సమయము, ఎటువంటి దోషములు లేకుండా నమోదు చేయించుకోవాలి.నెలవారీ జీతబత్యములు పొందుటకుగాను ఎంప్లాయి ట్రెజరీ ఐడి నెం. ఎలాట్ మెంట్ కొరకు STO గారి ద్వారా డి.టి.ఓ.గారికి ప్రతిపాధనలు వంపుకొనవలెను.
1) డిపార్టుమెంట్ కోడ్ : 065, స్కూల్ ఎడ్యుకేషన్,
2) సెక్టర్ కోడ్ విత్ డిస్క్రిపక్షన్స్ : 01- స్టేట్ గవర్నమెంట్, 04- జిల్లా పరిషత్, 05- మండల పరిషత్, 08- మున్సిపాలిటి
3) కేటగిరి: యన్.జీవోగా గుర్తించించి యంప్లాయీ బ్రెజరి ఐడి కొరకు దరఖాస్తు చేసుకోవాలి.
5. నర్వీస్ రెగ్యులైజేషన్ కొరకు ఉపయోగపడే అటి స్టేషన్ (3 సెట్లు) ఫారాలు సంబంధిత హెచ్.యం./యం. ఈ.ఓ. ద్వారా డి.ఈ.ఓ కి సమర్పించాలి.
B. నూతన పెన్షన్ విధానంలో భాగంగా ఉద్యోగంలో చేరిన వెంటనే PRAN (Perminent Relaiment Account No.) పొందుటకు హెచ్.ఎమ్/ఎం.ఈ.ఓ. ల వారి ద్వారా 51 పారాలు, 3 సెట్లు సంబంధిత కార్వే కన్సల్టెంన్సీ, విశాఖపడటం/హైదరాబాద్ వారికి పంపుకోవాలి.
7. ప్రతి నెల జీతంలో Pay + DA మొత్తంలో 10% మినహాయింపు చేయబడును. అంతేమొత్తం ప్రభుత్వం నుండి మీ ప్రాన్నెంబరుకు జమచేయబడును.
B. మొదటి నెల జీతము నుండి విధిగా APGLI మినహాయింపు చేయించుకొని సంబంధిత దరఖాస్తును యం. ఈ.ఓ/హెచ్.యం. ద్వారా బాండుకొరకు APGLI జిల్లా కార్యాలయమునకు పంపుకోవాలి.
9. SGT కేడర్ వారు రూ. 30/- SA కేడర్ వారు రూ. 60/- GIS ను జీతము నుండి మినహాయింపు చేసుకోవాలి.
10. ప్రతి నెల జీతము నుండి EHS (Employe Health Scheme) ప్రీమియంను SGT కేడర్, SA కేడర్ వారు తప్పనిసరిగా ప్రస్తుతం రూ. 90/-లు మినహాయింపు చేసుకొని యం. ఈ.ఓ./హెచ్.యం.ల ద్వారా హెల్త్ కార్డులు పొందుటకు ప్రతిపాదనలు పంపుకోవాలి.
11. ప్రతి నెల జీతం నుండి వృత్తిపన్ను SGT&SA కేడర్ వారు ప్రస్తుతం రూ. 200/- మినహాయింప బడుతుంది.
12. ప్రతి సంవత్సరం కాలెండర్ సంవత్సరం (జనవరి-డిశెంబర్)లో ప్రతి పురుష ఉపాధ్యాయులు 15 సాధారణ సెలవులు,7 ప్రత్యేక సెలవులను 5 ఆప్షనల్ సెలవులను వినియోగించుకోవచ్చు. మహిళా ఉపాధ్యాయినిలు పై సెలవులతో పాటు అదనంగా 5 ప్రత్యేక సెలవులను వినియోగించుకోవచ్చు.
0 comments:
Post a Comment