ఈరోజు ఫ్యాప్టో పక్షాన విద్యా శాఖ మంత్రి గారిని కలిసి బదిలీలు షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని, ఈరోజు జరిగే రివ్యూ మీటింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని కోరడమైనది.
ఇప్పటికే బదిలీలు ఆలస్యం అయినాయి కావున ఆగస్టు 31 కట్ ఆఫ్ తేదీ గా పరిగణించి ఆ తేదీ వరకు ఉన్న ఖాళీలను తీసుకోవాలని కోరడమైనది.
2018 డిఎస్సీ వారికి తాత్కాలిక ప్రాతిపదికన పోస్టింగ్స్ ఇచ్చి బదిలీలు పూర్తి అయిన వెంటనే వారికి రీ కౌన్సెలింగ్ జరిపి పూర్తి స్థాయిలో పోస్టింగ్స్ ఇవ్వాలని ఫ్యాప్టో పక్షాన ప్రాతినిధ్యం చేయడం జరిగింది.
మంత్రి గారు సానుకూలంగా స్పందించి అధికారులు తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీనియర్లు కు న్యాయం చేస్తామని తెలిపారు.
మంత్రి గారిని కలిసిన వారిలో పి.బాబురెడ్డి,CH. జోసెఫ్ సుధీర్ బాబు, P.పాండురంగ వరప్రసాద్ గారు ఉన్నారు....
0 comments:
Post a Comment