పాఠశాలల నిర్వహణపై తాజా మార్గదర్శకాలు

 పాఠశాలల నిర్వహణపై తాజా మార్గదర్శకాలు

★ ఆంధ్రప్రదేశ్ లో  పాఠశాలలు పాక్షికంగా తెరిచిన క్రమంలో ఆరోగ్య పరంగా సమస్యలు  ఉన్న టీచర్లు ఇతర సిబ్బంది ఫ్రంట్ లైన్ పని కి దూ రంగా  ఉండాలని పాఠశాల విద్యాశాఖ  మార్గదర్శకాలు ఇచ్చింది. 


★ ఏపీ ప్రభుత్వమూ సెప్టెంబరు 21 నుంచి పాక్షికంగా స్కూళ్లు తెరిచింది.  పాఠశాలల్లో కార్యకలాపాల నిర్వహణ, పాఠశాలల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ కమిషనర్  బుధవారం మార్గదర్శకాలు ఇచ్చారు.  ఇందులో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి....


★ వయసు ఎక్కువ ఉన్న ఉద్యోగులు,టీచర్లు, గర్భిణులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఫ్రంట్ లైన్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులతో నేరుగా కాంటాక్టు లేకుండా చూసుకోవాలి.


★ టీచర్లకు బయోమెట్రిక్  హాజరు వద్దు. ప్రత్యామ్నాయ మార్గం చూడాలి.  కాంటాక్టు లెస్ అటెండెన్సు తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలి.


★ బోధన, బోధనేతర సిబ్బంది 50శాతం మంది హాజరు కావాలి.


★ పాఠశాలల్లో ఆరు అడుగుల దూరం  ఉండేలా చూసుకోవాలి. అందరూ మాస్కులు వినియోగించాలి.


★ పిల్లలు తరచు 40 నుంచి 6 0 సెకన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలి.


★ ఆల్కహాల్ శానిటైజర్లు వినియోగించేలా  చూడాల్సి ఉంటుంది.


★ పిల్లల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ  ఎవరికి  ఎలాంటి ఇబ్బంది వచ్చినా  తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.


★ తరగతి గదిలో ఆరడుగుల దూరం ఉండేలా బెంచీలు, డెస్కుల సిటింగ్ ఏర్పాటు చేయాలి


★ వాతావరణం సహకరిస్తే  టీచర్లకు -విద్యార్థులకు మధ్య సందేహాల నివృత్తికి బహిరంగ ప్రదేశాలు వినియోగించుకోవడమే మేలు.


★ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేని టీచర్లు, సిబ్బంది, విద్యార్థులను మాత్రమే పాఠశాలలకు అనుమతించాల్సి ఉంటుంది.


★ విద్యార్థులు పెన్నులు, మంచినీళ్ల బాటిళ్లు ఇతర వస్తువులు ఒకరి నుంచి మరొకరు తీసుకోకుండా పర్యవేక్షించాలి.


★ పాఠశాలల్లో తరగతి గదులు, తలుపులు, కిటీకీలు ప్రతి రోజూ శుభ్రం చేయించాలి. కామన్  ఏరియాల్లో సబ్బులు, శానిటైజర్లు అందుబాటులో ఉండేలా చూడాలి.


★ పాఠశాలలు తెరవడానికి ముందు, తరగతులు పూర్తయిన తర్వాత ఇవన్నీ శుభ్రం చేయించాలి.


★ ఇందుకు అవసరమయ్యే నిధులను స్కూలు కాంపోజిట్ నిధుల నుంచి వినియోగించుకోవాలి.


★ టీచర్లు మాన్యువల్ పద్ధతిలో అటెండెన్సు నమోదు చేయాలి. విద్యార్థుల హాజరు కూడా నిర్ణీత నమూనాలో  తీసుకుని ప్రతి రోజు జిల్లా విద్యాధికారికి పంపాలి

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top