ఈ ఏడాది చేపట్టబోతున్న ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ ప్రాథమిక పాఠశాలకు జీవం పోసే విధంగా ఉండాలని కోరుతున్నాము.ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ప్రకారం అన్ని ఏకోపాద్యాయ పాఠశాలలు రెండో పోస్టు కేటాయించడం వలన పరిపుష్టంఅవుతాయి. మంచి గుణాత్మక ఫలితాలు రావడానికి ఈ చర్య దోహద పడుతుంది.రేషనలైజేషన్ లో ఫిబ్రవరి 29 నాటి రోలు తీసుకుంటున్నందువలన ఇటీవల ఎక్కువ సంఖ్యలో పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వలన, అమ్మఒడి పథకం వలన, నాడు నేడు అభివృద్ధి పనుల వలన ప్రవేశాలు పెరిగాయి. సదరు పాఠశాలలకు అదనపు పోస్టులు అవుసరం అవుతున్నాయి.
మరి కొన్ని పాఠశాలలు ఫిబ్రవరి 29 నాటి రోలు ప్రకారం పోస్ట్ పోతుంది. ఇప్పటి రోలు ప్రకారం చూస్తే పోస్టు పోవడం లేదు. ఇలాంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి. అలాంటి పారశాలలకు ఇప్పటి రోలునే ప్రాతిపదికగా తీసుకోవాలి.జూలై 1వ తేదీన ఉపాధ్యాయ సంఘాల సమావేశం లో అంగీకరించిన ప్రకారం 40 రోలు దాటిన తర్వాత ఖచ్చితంగా మూడో పోస్టు కటాయించాలి. వీలుకాని పక్షంలో అకడమిక్ ఇన్ స్పక్టర్ లను నియమించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మంజురైన పోస్టులు సరిపోని పరిస్థితి ఏర్పడితే కొత్తగా పోస్టులను మంజూరు చేయడం గానీ లేదా అకడమిక్ ఇన్ స్పక్టర్ లను నియమించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగాఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ( ఫ్యాప్టో ) ప్రభుత్వాన్ని కోరింది
0 comments:
Post a Comment