డిపార్ట్మెంట్ పరీక్షలో నెగెటివ్ మార్కులు విధానం తొలగింపు...ఉత్తర్వులు త్వరలోనే.
ప్రభుత్వం 2016 నుంచి ఉద్యోగుల డిపార్ట్మెంట్ పరీక్షలలో నెగటివ్ మార్కుల విధానం అమలు చేస్తుంది. ఒక తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు తగ్గిస్తున్నారు.
దీనితో ఉద్యోగులు డిపార్ట్మెంట్ పరీక్షలలో పాస్ కావాటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ..
పరీక్ష రాస్తున్నవారిలో 10 శాతం కూడా పాస్ కావటం లేదు. దీని వలన చాలా ఉద్యోగులు సకాలంలో ఇంక్రిమెంట్, పదోన్నతులు పొందలేకపోతున్నారు.
A.P Govt Employees Federation ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లగా.... నెగటివ్ మార్కుల విధానాన్ని తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి గారు సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. నేడో, రేపో దీనిపై ఉత్తర్వులు వెలువడతాయి. దీని వలన ఉద్యోగులు సకాలంలో పదోన్నతులు పొందడంతో పాటు లక్షకు పైగా ఉన్న సచివాలయ ఉద్యోగులు త్వరగా రెగ్యులర్ అయ్యే అవకాశాలు కలుగుతాయి. నెగిటివ్ మార్కులు విధానం తొలగించినందుకు ముఖ్యమంత్రి గారికి ఉద్యోగులందరూ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
కె వెంకట్ రామ్ రెడ్డి
చైర్మన్
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్
0 comments:
Post a Comment