కేజీబీవీల్లో 6వ తరగతిలో ప్రవేశానికి రెండో విడత జాబితా విడుదల :: సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి వెల్లడి
❖ కస్తుర్భా గాంధీ బాలికా విద్యాలయాలలో (కేజీబీవీలలో) 2020 -21 విద్యాసంవత్సరానికి, 6వ తరగతిలో ప్రవేశం కోసం, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండవ విడతలో ఎంపిక చేసిన విద్యార్థినుల జాబితాను సంబంధిత కేజీబీవీలకు పంపినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
❖ ఎంపికైన విద్యార్థుల మొబైల్ నంబరుకు ఇప్పటికే సమాచారం పంపడమైనదని పేర్కొన్నారు.
❖ ఆ విద్యార్థినులు 13.09.2020వ తేది నుండి 20.09.2020వ తేదీలోగా సంబంధిత కేజీబీవీలలో స్పెషల్ ఆఫీసర్లకు తగిన ధృవపత్రాలతో రిపోర్ట్ చేయాలన్నారు.
❖ మొబైల్ ఫోన్ ద్వారా సమాచారం అందించిన ప్రకారం విద్యార్థినులు కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బదిలీ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ వంటివి తమతో పాటు తీసుకెళ్లాలని తెలిపారు.
KGBV :: Provisional Selection List For Intermediate and 6th to 8th Classes
0 comments:
Post a Comment