వెట్రి సెల్వి గారు 2014 లో ఇండియన్ సివిల్స్ లో 143 ర్యాంక్ తెచ్చుకోని IAS కు ఎంపికైనారు.ఈమె తమిళనాడు రాష్ట్రంలో శివ గంగాయి జిల్లా లో కొలతూరు గ్రామంలో సాధారణ మధ్య తరగతి కుటుంబం లో జన్మించారు.తండ్రి కన్నన్ ఎల్.ఐ. సి ఏజెంట్ గా,తల్లి లత గృహిణి గా ఉంటూ....ఈమెను డిగ్రీ ఎథిరాజ్ కాలేజ్ ( చెన్నై), ఎమ్మెస్సి (బయో టెక్నాలజీ) వరకు మద్రాస్ యూనివర్సిటీ లో చదివించారు.2014 సివిల్స్ లో ఆంద్రప్రదేశ్ క్యాడర్ కు ఎంపికై ప్రకాశం జిల్లాలో శిక్షణ ముగించి..మొదటి పోస్టింగ్ దేశంలోని అతి పెద్ద రెవిన్యూ డివిజన్ గా పేరు పొందిన మదన పల్లె సబ్ కలెక్టర్ గా చేరి 16 నెలలు.. ఎన్నో సమస్యలుకు పరిష్కారం చూపారు.ప్రధానంగా భూ సమస్యలను పెద్ద ఎత్తున పరిష్కరించారు.ఎన్నో ఒత్తిళ్లు ను ఎదుర్కొని ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ దారులపై చర్యలు,భూమి పాసు పుస్తకాలు,మదన పల్లె నుండి పలమ నేరు వరకు NH-42 రోడ్డు విస్తరణ,పుంగ నూరు ప్రజలు ట్రాఫిక్ సమస్య పరిష్కారం,తట్టి వారి పల్లె నుండి పలమనేరు వరకు 54 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులు, వంటి పనులకు శ్రీకారం చుట్టారు. సవాళ్ళకు వెరవని ధైర్యశాలి వెట్రి సెల్వి..కుప్పం స్పెషల్ ఆఫీసర్ గా..చిత్తూరు జిల్లాలో సవాళ్ల కు ధీటుగా విధులు నిర్వహించి,ఆమె మంచి ప్రతిభ చూపారు..రాయలసీమ ప్రజల దాహార్తి ని తీర్చేందుకు అపర భగిరథుడు వైఎస్సార్ ప్రారంభించిన హంద్రీ- నీవా కాలువ పనులు పూర్తి చేసే ఆలోచనతో.. కోర్టు వివాదాలు ఉంటే కోర్టులో కేసు వేసిన రైతులు( రామిరెడ్డి గారి పల్లె,చిప్పిలి-మదన పల్లె మండలం) గ్రామస్తులు తో మాట్లాడి,చర్చించి కేసులు వెనక్కి తీసుకునేల చేసి కాలువ నిర్మాణ పనుల్లో సహక రించడం లో చొరవ చూపారు.తదుపరి నెల్లూరు జాయింట్ కలెక్టర్ గా కూడా మంచి ప్రతిభ కనపరిచారు.ప్రస్తుతం ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకం తో ప్రతిష్టాత్మకంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలు లో ఇంగ్లీష్ మీడియం ను ప్రవేశ పెట్టే ఉద్దేశ్యం లో భాగంగా ఈమెను స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో స్పెషల్ ఆపీసర్ -ఇంగ్లీష్ మీడియం... గా ప్రభుత్వం నియమించింది.ఈ బాధ్యతలుతో పాటు, ఈ రోజు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ సమగ్ర శిక్షా కు రాష్ట్ర పథక సంచాలకులు (SPD) గా,వాడ్రేవు చిన వీర భద్రుడు స్థానంలో నియమించింది..కావున మన ఉద్యోగుల అందరికి.. గౌరవ వెట్రి సెల్వి మేడం గారు ద్వారా మంచి జరగాలి..అని ఆశిద్దాము.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment