అద్భుతమైన స్కీమ్ - అటల్ పెన్షన్ యోజన

రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందాలనుకునేవారికి అద్భుతమైన స్కీమ్ ఉంది. అటల్ పెన్షన్ యోజన మీకు బాగా ఉపయోగపడే పథకం. 

▪️మీ వయస్సు తక్కువ ఉన్నప్పుడే ఈ స్కీమ్‌లో చేరితే తక్కువ పొదుపు చేసి ఎక్కువ పెన్షన్ పొందొచ్చు. 

▪️ఉదాహరణకు మీ వయస్సు 22 అయితే మీరు నెలకు రూ.5,000 పెన్షన్ పొందాలంటే నెలకు రూ.292 మాత్రమే పొదుపు చేయాలి.
 నెలకు రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. 

▪️మీ వయస్సు 18 ఏళ్లు అయితే రోజుకు రూ.7 చొప్పున నెలకు రూ.210 పొదుపు చేస్తే చాలు రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.5,000 పెన్షన్ పొందొచ్చు. 

▪️ఒకవేళ 40 ఏళ్ల వయస్సులో ఈ స్కీమ్‌లో చేరి రూ.5,000 పెన్షన్ పొందాలనుకుంటే నెలకు రూ.1,454 జమ చేయాలి.

ఈ స్కీం లో ఎవరు చేరాలి?


18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారెవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. 

▪️ ఎక్కడ చేరాలి?


బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు ఈ స్కీమ్‌ను ఎంచుకోవచ్చు.

ప్రీమియం ఎలా చెల్లించాలి?


 నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకోసారి డబ్బులు జమ చేయొచ్చు. 

ఎన్ని సంవత్సరాలు వచ్చే వరకు పొదుపు చేయాలి?

మీరు ఈ పథకంలో చేరిన నాటి నుంచి మీ 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొదుపు చేయాలి.

మీకు 60 ఏళ్లు పూర్తైన నాటి నుంచి నెలకు పెన్షన్ లభిస్తుంది. 

నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ పొందొచ్చు.

కేవలం పెన్షన్ మాత్రమే కాదు లబ్ధిదారులు మరణిస్తే నామినీకి పెన్షన్ కార్పస్ కూడా లభిస్తుంది. 

▪️రూ.1,000 పెన్షన్ పొందేవారికి రూ.1,70,000, 

▪️రూ.2,000 పెన్షన్ పొందేవారికి రూ.3,40,000, 

▪️రూ.3,000 పెన్షన్ పొందేవారికి రూ.5,10,000, 

▪️రూ.4,000 పెన్షన్ పొందేవారికి రూ.6,80,000, 

▪️రూ.5,000 పెన్షన్ పొందేవారికి రూ.8,50,000 చొప్పున పెన్షన్ కార్పస్ లభిస్తుంది.

Scheme Complete Details

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top