స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసే చేసేవారికి కి నూతన గైడెన్స్

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసే చేసేవారికి కి నూతన గైడెన్స్ ఈ విధంగా ఉన్నవి ఖాతాదారులు గమనించగలరు.....


▪️స్టేట్ బ్యాంక్ ప్రకారం.. మెట్రో నగరాల్లో బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారికి నెలకు 8 ఏటీఎం ట్రాన్సాక్షన్లు ఉచితంగా లభిస్తాయి. 


▪️ఈ పరిమితి దాటితే మాత్రం కచ్చితంగా చార్జీలు పడతాయి. 

▪️8 ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్లలో 5 ఎస్‌బీఐ ఏటీఎంలకు వర్తిస్తాయి. 

▪️ మిగతా మూడు లావాదేవీలను ఇతర బ్యాంకుల ఏటీఎంల ద్వారా నిర్వహించొచ్చు.

▪️ ఇతర పట్టణాల్లో ఎస్‌బీఐలో బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి నెలకు 10 ఉచిత ఏటీఎం లావాదేవీలు నిర్వహించే అవకాశముంది. 

▪️ఈ పదిలో 5 లావాదేవీలను ఎస్‌బీఐ ఏటీఎం నుంచి నిర్వహించొచ్చు. 

▪️ఇక మిగిలిన ఐదు ట్రాన్సాక్షన్లను ఇతర బ్యాంకుల ఏటీఎంలకు వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. ఎలాంటి చార్జీలు పడవు.

▪️ఏటీఎంలో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మాత్రం బ్యాంక్ మీకు చార్జీలు విధిస్తుంది. 

▪️బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా కూడా ఏటీఎం ద్వారా తీసుకోవాలని వెళ్లినప్పుడు, డబ్బులు తక్కువగా ఉండటం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే.. అప్పుడు బ్యాంక్ కస్టమర్ నుంచి రూ.20 చార్జీ వసూలు చేస్తుంది. దీనికి జీఎస్‌టీ అదనం.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top