గత 24 గంటల్లో 6,64,949 కోవిడ్ పరీక్షలతో భారత్ సరికొత్త రికార్డ్

 గత 24 గంటల్లో 6,64,949 కోవిడ్ పరీక్షలతో భారత్ సరికొత్త రికార్డ్

 


పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే త్రిముఖ వ్యూహం మీద దృష్టి సారించిన భారత్ వరుసగా మూడో రోజు కూడా లక్షకు పైబడి కోవిడ్ పరీక్షలు జరిపింది. రోజువారీ పరీక్షల సంఖ్య వేగంగా పెంచాలన్న భారత్ పట్టుదల ఫలితంగా రోజుకు ప్రతి పదిలక్షల పరీక్షల దిశగా సాగుతోంది. గడిచిన  24 గంటల్లో జరిపిన పరీక్షల సంఖ్య 6,64,949 గా నమోదైంది.



దీంతో ఈరోజు వరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 2,21,49,351కు చేరింది. ప్రతి పదిలక్షలమందిలో పరీక్షల సంఖ్య కూడా వేగంగా పెరిగి 16050 కి చేరింది. దూకుడుగా పరీక్షలు జరపటం సాగితే తప్ప పాజిటివ్ కేసులు బైటపడవు. అలాగే వాళ్ళకు దగ్గరైనవారి ఆనవాళ్ళు తెలియవు. అలా తెలుసుకుంటేనే వారిని ఐసొలేషన్ లోకి పంపటం సాధ్యమవుతుంది.   చికిత్స చేయటం కూదా కుదురుతుంది.

పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే త్రిముఖ వ్యూహం విజయవంతంగా అమలు చేయటానికి పనికొచ్చిన అంశం దేశవ్యాప్తంగా అవిచ్ఛిన్నంగా విస్తరిస్తున్న లాబ్ ల నెట్ వర్క్. ఇప్పుడు దేశంలోని లాబ్ ల నెట్ వర్క్ లో మొత్తం 1370  లాబ్స్ ఉండగా అందులో ప్రభుత్వ రంగంలో 921, ప్రైవేట్ రంగంలో 449 ఉన్నాయి. వాటి వివరాలు ఇవి:



తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ :  698   (ప్రభుత్వ: 422  + ప్రైవేట్:  276)

ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 563  (ప్రభుత్వ: 467  + ప్రైవేట్: 96)

సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 109  (ప్రభుత్వ: 32  + ప్రైవేట్ 77 )


కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి


కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19@gov.in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019@gov.in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు


కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top