ఏపీలో మూడు రాజధానులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్... సీఆర్డీఏ రద్దు...
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.
రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ ఓకే చెప్పారు.
ఈ రెండు బిల్లులకు రాజ్ భవన్ నుంచి ఆమోదం లభించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టింది.
దీన్ని ఏపీ శాసనసభ ఆమోదించింది. అయితే, మొదటిసారి ఏపీ శాసనమండలిలో ఈ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని చైర్మన్ ప్రకటించారు. అయితే, మూడు నెలలు గడిచిన తర్వాత మరోసారి అవే బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో రెండోసారి ఆమోదించి మండలికి పంపింది. అక్కడ బిల్లులపై ప్రతిపక్ష టీడీపీ అభ్యంతరం తెలిపింది.

0 comments:
Post a Comment