▪️సమగ్ర శిక్షాభియాన్ ఆధ్వర్యంలో భారతీయ భాషాధ్యయన కేంద్రం, మైసూరు నుంచి ప్రతి పాఠశాలకు 82 పుస్తకాలను జిల్లా విద్యాశాఖ ద్వారా సరఫరా చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు మార్గదర్శకాలు జారీచేశారు.
▪️ఈ పుస్తకాల్లో కథలు, సైన్సు, గణితం, విజ్ఞానం, బాలసాహిత్యం ఉన్నాయి.
▪️వచ్చిన పుస్తకాలను ఉపాధ్యాయులు తమ పాఠశాల గ్రంథాలయంలో నమోదు చేసి, వాటిని విద్యార్థులకు ఇళ్ల వద్ద అందజేసి చదివేలా ప్రోత్సహించాలి.
▪️పుస్తక పఠనం పూర్తి చేసిన విద్యార్థులు తమ సమీపంలోని తోటి విద్యార్థులకు వాటిని అందించాలి.
▪️పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఆ పుస్తకాలను తిరిగి ఉపాధ్యాయులకు అందజేయాలి.
▪️ఇళ్లకే పరిమితమైన విద్యార్థులు ఖాళీ సమయాల్లో కథలు, బాల సాహిత్యం చదవడం ద్వారా వారిలో పఠనాసక్తి, మేధస్సు పెంపొందించాలన్నదే ‘పుస్తక నేస్తం’ లక్ష్యం.
▪️ఇదే సందర్భంలో పాఠశాల గ్రంథాలయ నిర్వహణపై విద్యార్థులకు అవగాహన పెరుగుతుందని అధికారులు ఆశిస్తున్నారు.

0 comments:
Post a Comment