విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట గురించి

 విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట గురించి.
File No.SS-16021/31/2020-MIS SEC-SSA
రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు, ఐ.ఎ.ఎస్.
ఆర్.సి.నెం. ఎస్.ఎస్ 16021/4/2019 ఎం.ఐ.ఎస్. ఎస్.ఇ.సి. ఎస్ఎస్ఏ తేది: 01/06/2020
*విషయం: సమగ్ర శిక్షా ' జగనన్న విద్యా కానుక విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి నమోదు చేయుట గురించి.*
నిర్దేశములు: 1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షా: ఆర్.సి. నెం. ఎస్.ఎస్ 16021/4/2019 ఎం.ఐ.ఎస్. ఎస్.ఇ.సి.-ఎస్ఎస్ఏ తేది : 18.03.2020

ఆదేశములు

1.     ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2020- 21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్య పాఠశాల్లోని ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుతోన్న అందరు విద్యార్థులకు సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో 'జగనన్న విద్యా కానుక 'పేరుతో స్టూడెంట్ కిట్లను సరఫరా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
2.     ఇందులో భాగంగా ఒక్కో స్టూడెంట్ కిట్లో మూడు జతల యూనిఫాంలు, ఒక సెట్ నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు ఉంటాయి.
3.     ప్రతి విద్యార్థికి బూట్లు పంపిణీ చేసే ప్రక్రియలో భాగంగా గత సంవత్సరంలో జరిగిన బూట్ల సరఫరాలో ఎదురైన ముఖ్య సమస్య 'బూట్ల సైజు సరిగా ఉండకపోవడం', తద్వారా కొందరు విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు.
4.     ఈ సమస్యను అధిగమించడానికి విద్యార్థుల నుంచి స్వయంగా పాదకొలతలు తీసుకోవడానికి ఈ కింది సూచనలు పొందుపరచడమైనది.
*బూట్ల సరఫరా కోసం విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించాల్సిన సూచనలు*
 • రాష్ట్రంలోని విద్యా, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ/ మండల పరిషత్/ జిల్లా పరిషత్/ మున్సిపల్/ కేజీబీవీ/ మోడల్ స్కూల్స్/ ఆశ్రమ/ రెసిడెన్షియల్/ ఎయిడెడ్ పాఠశాల్లో ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిల, అబ్బాయిల పాదాల కొలతలను తీసుకోవాలి.
 • ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు/ తరగతి ఉపాధ్యాయులు/ వ్యాయామ ఉపాధ్యాయులు/ పార్ట్ టైమ్ ఇనస్టక్టర్లు, స్థానికంగా ఉన్న సిబ్బంది బాధ్యత తీసుకోవాలి. ఈ బాధ్యత నిర్వహించినందుకు సంబంధిత ఉపాధ్యాయునికి తగిన పారితోషికం ఇవ్వబడుతుంది.
 • ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదు.
 • విద్యార్థుల పాదాల కొలతలను ఆన్లైన్ ద్వారా నమోదు చేయుట. ఈ బాధ్యతను సీఆర్పీలకు అప్పగించడమైనది.
*ముఖ్యంగా చేయవలసినవి*
• విద్యార్థులపాదాల కొలతలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవలసిన అంశము.. తర్వాతి సంవత్సరానికి అనుగుణంగా (వారి పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని) పాదాల కొలత సైజును పెంచి తీసుకోవాలి.
(: : ఉదాహరణకు ఒక విద్యార్థి పాదం ప్రస్తుత సైజు 5 ఇంచీలు ఉంటే కాస్త పెంచి 6 ఇంచీలు సైజుగా నమోదు చేయాలి.)
• ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి తమ పాఠశాల విద్యార్థులను 8.6.2020 మరియు 9.6.2020 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలకు రప్పించాలి.
• విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేటప్పుడు కోవిడ్- 19 ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా ఆచరిస్తూ భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్, హేండ్ వాష్ వంటివి తప్పక వినియోగించి తగు జాగ్రత్తలు వహించాలి.
• శానిటైజర్ వంటి వాటి కోసం పాఠశాల కాంపోజిట్ నిధులను వినియోగించుకోవాలి . పాఠశాలకు రాలేని, పాఠశాలకు దూరంగా ఉన్న విద్యార్ధుల, కేజీబీవీ/ మోడల్ స్కూల్స్/ ఆశ్రమ/ రెసిడెన్షియల్ తదితర హాస్టల్లో చదివే బాలబాలికల పాదాల కొలతలు తీసుకోవడానికి జగనన్న గోరుముద్ద పథకం (మధ్యాహ్నభోజనం)లో భాగంగా విద్యార్థులకు డ్రై రేషన్ (బియ్యం , చిక్కీ, గుడ్లు) అందిస్తున్న వాలంటీర్ల సాయం తీసుకొని, ఆ విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేలా సీఆర్పీలు చర్యలు తీసుకోవాలి.
*నమోదు ఇలా*
• విద్యార్థుల పాదాల కొలతలన్నీ హెచ్ఎం లాగిన్లలో పొందుపరచాలి.
• హెచ్ఎం లాగిన్ ఓపెన్ చేయగానే పాఠశాల, విద్యార్థుల పేర్లు, తదితర వివరాలు ఉంటాయి.
• విద్యార్థుల వివరాల పక్కనే సైజ్ ఆప్షన్ బాక్సులో వారి పాదాల కొలతలను సెంటీ మీటర్లలో నింపాలి.
*సెంటీ మీటర్లు = ఇంచీలు*
➤ 2.54 సెంటీమీటర్లు = 1 ఇంచ్
➤ 15.08 సెంటీమీటర్లు = 2 ఇంచీలు
➤ 7.62 సెంటీమీటర్లు = 3 ఇంచీలు
➤ 10.16 సెంటీమీటర్లు = 4 ఇంచీలు
➤ 12.7 సెంటీమీటర్లు = 5 ఇంచీలు
➤ 15.24 సెంటీమీటర్లు = 6 ఇంచీలు
➤ 17.78 సెంటీమీటర్లు = 7 ఇంచీలు
➤ 20.32 సెంటీమీటర్లు = 8 ఇంచీలు
➤ 22.86 సెంటీమీటర్లు = 9 ఇంచీలు
➤ 25.4 సెంటీమీటర్లు = 10 ఇంచీలు,
• స్థానికంగా ఉన్న ఫుట్వేర్ దుకాణాల్లో 'పాదాల కొలత సాధనం' తీసుకొచ్చి పాదాల కొలత తీసుకోవడం.
• లేనిపక్షంలో ఒక అట్ట మీద స్కేలు/ టేపుతో కొలతలు గీసి జాగ్రత్తగా నమోదు చేయాలి.
• హెచ్ఎం లాగిన్లలో పొందుపరిచినటువంటి స్క్రీన్ లో 10.6.2020 లోగా నమోదు చేయాలి.
• ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో తరగతి ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి.
• ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమం సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి.
• ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్ లో హెడ్మాష్టరు లాగిన్ ద్వారా కొలతలు నమోదు చేయాలి.
• ప్రధానోపాధ్యాయులు/ సీఆర్పీలు ఈ కార్యక్రమాన్ని కచ్చితంగా జరిగేలా బాధ్యత వహించాలి.
          రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్రశిక్షా అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్లు పూర్తి శ్రద్ధతో పై ఆదేశాలను అత్యంత జాగరూకతతో అమలు చేయవలసిందిగా ఇందుమూలంగా ఆదేశించడమైనది.

వాడ్రేవు చినవీరభద్రుడు,
సమగ్ర శిక్షా, రాష్ట్ర పథక సంచాలకులు
1. అందరు జిల్లా విద్యాశాఖాధికారులకు
2. అందరు సమగ్ర శిక్షా అదనపు కో- ఆర్డినేట lockర్లకు
3. పాఠశాల విద్యాశాఖ కమీషనరు వారికి
4. దీని ప్రతిని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ వారి సమాచారం నిమిత్తం సమర్పించనైనది.
5. గౌరవనీయ పాఠశాల విద్యాశాఖామాత్యుల కార్యాలయంలో ప్రత్యేకాధికారి వారికి.

Download Proceeding Copy
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top