ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ధ్య టెలిఫోన్ సంభాష‌ణ

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ధ్య టెలిఫోన్ సంభాష‌ణ‌
ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజుటెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు.  గ్రూప్ ఆఫ్ 7 కు అమెరికా అధ్య‌క్ష‌త గురించి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. అలాగే గ్రూప్ ఆఫ్ 7 దేశాల కూట‌మిని ప్ర‌స్తుత స‌భ్య‌దేశాల‌నుంచి ఇంకా విస్త‌రించాల‌న్న త‌న ఆకాంక్ష‌ను ఆయ‌న తెలియ‌జేశారు. ఇందులో ఇండియాతో స‌హా ప‌లు ఇత‌ర ముఖ్య‌మైన దేశాల‌కు స‌భ్యత్వం గురించి ఆయ‌న మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఆయ‌న , అమెరికాలో జ‌ర‌గనున్న త‌దుపరి జి-7 దేశాల స‌ద‌స్సుకు హాజ‌రుకావ‌ల‌సిందిగా ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని ఆహ్వానించారు.
  కోవిడ్ అనంత‌ర ప్ర‌పంచంలో ఏర్ప‌డ‌బోయే వాస్త‌విక  ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి విస్తారిత వేదిక ఉండాల‌న్న వాస్త‌వాన్ని గుర్తిస్తూ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సృజ‌నాత్మ‌క , దూర‌దృష్టితో కూడిన వైఖ‌రిని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ప్ర‌శంసించారు. అమెరికా , ఇత‌ర దేశాల‌తో క‌ల‌సి ప్ర‌తిపాదిత స‌ద‌స్సు విజ‌యానికి కృషిచేయ‌డం ఇండియాకు సంతోషం క‌లిగించే అంశ‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.
 అమెరికాలో జ‌రుగుతున్న పౌర ఆందోళ‌న‌ల‌పై  ప్ర‌ధాన‌మంత్రి త‌న ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ , ప‌రిస్థితి త్వ‌ర‌లోనే స‌ద్దుమ‌ణ‌గ‌గ‌ల‌ద‌‌న్న‌ ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు.
 ఇరువురు నాయ‌కులూ ఉభ‌య దేశాల‌లో కోవిడ్ -19 ప‌రిస్థితులు, ఇండియా-చైనా స‌రిహ‌ద్దుల లో ప‌రిస్థితి,ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌లో సంస్క‌ర‌ణ‌ల ఆవ‌శ్య‌క‌త వంటి ప‌లు అంశాల‌పై  త‌మ అభిప్రాయాల‌ను  పంచుకున్నారు.
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో తాను  భార‌త‌దేశంలో జ‌రిపిన‌ ప‌ర్య‌ట‌న విశేషాల‌ను గుర్తుచేసుకున్నారు. ఈ ప‌ర్య‌ట‌న ఎన్నో ర‌కాలుగా చ‌రిత్రాత్మ‌కం, చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని, ఈ ప‌ర్య‌ట‌న ఉభ‌య దేశాల ద్వైపాక్షిక సంబంధాల‌కు కొత్త ఊపును తీసుకువ‌చ్చింద‌ని ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.
 ఇరువురు నాయ‌కుల మ‌ధ్య  అద్భుత‌మైన ఆద‌రాభిమానాల‌తో  సాగిన ఈ సంభాష‌ణ ,భార‌త‌- అమెరికా సంబంధాల  ప్రత్యేక స్వభావాన్ని,  ఇరువురు నాయకుల మధ్య గ‌ల‌ స్నేహం  పరస్పర గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top