హయ్యర్ సెకండరీ స్టేజ్ ( 11 మరియు 12వ తరగతులు) ప్రత్యామ్నాయ అకాడెమిక్ క్యాలెండర్ ను ఈ రోజు విడుదల చేసిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
ప్రత్యామ్నాయ అకాడెమిక్ క్యాలెండర్ వివిధ సాధనాలు మరియు ప్లాట్ ఫామ్ లకు విద్యార్థల ప్రాప్యత స్థాయిలను పరిగణలోకి తీసుకుంటుంది – శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ ‘నిశాంక్’
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ ఫోఖ్రియాల్ నిశాంక్ ఈ రోజు న్యూఢిల్లీలో హ
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఈ రోజు న్యూ Delhi హయ్యర్ సెకండరీ స్టేజ్ ( 11 మరియు 12వ తరగతులు) ప్రత్యామ్నాయ అకాడెమిక్ క్యాలెండర్ ను విడుదల చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సహాయంతో విద్యా కార్యకలాపాల ద్వారా కోవిడ్-19 కారణంగా విద్యార్థులను ఇంట్లో ఉండేటప్పుడు ఆ సమయాన్ని అర్ధవంతంగా వినియోగించుకునే దిశగా ఎం.హెచ్.ఆర్.డి. మార్గదర్శకత్వంలో క్యాలెండర్ అభివృద్ధి చేయటం జరిగింది.
ఈ సందర్భంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మాట్లాడుతూ, ఆహ్లాదకరమైన, ఆసక్తికరమైన మార్గాల్లో విద్యను అందించేందుకు అందుబాటులో ఉన్న వివిధ సాంకేతిక సాధనాలు మరియు సామాజిక మాధ్యమాల వాడకంపై క్యాలెండర్ ఉపాధ్యాయులకు మార్గదర్శకాలను అందిస్తుందని తెలిపారు. దీనిని అభ్యాసకులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కూడా ఇంటి నుంచే ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఏదేమైనా మొబైల్, రేడియో, టెలివిజన్, ఎస్.ఎం.ఎస్ మరియు వివిధ సోషల్ మీడియాలకు వివిధ సాధనాలు మరియు ప్లాట్ ఫామ్స్ మీద విద్యార్థుల ప్రాప్యత స్థాయిలను ఇది పరిగణలోకి తీసుకుంటుందని తెలిపారు.
ఇంటర్నెట్ సదుపాయం లేని, లేదా వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ లాంటి సామాజిక మాధ్యమ సాధనాలను వినియోగించలేని విద్యార్థుల కోసం, ఈ క్యాలెండర్ ద్వారా ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్, వాయిస్ కాల్స్ లేదా ఎస్.ఎం.ఎస్. మార్గంలో తల్లిదండ్రుల నుంచి విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే దిశగా ఉపయోగపడుతుందని శ్రీ ఫోఖ్రియాల్ తెలిపారు.
దివ్యాంగులైన విద్యార్థులు (ప్రత్యేక అవసరాలున్న పిల్లలు) సహా పిల్లలందరి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆడియో పుస్తకాల లింక్ లు, రేడియో కార్యక్రమాలు, వీడియో కార్యక్రమాలు చేర్చనున్నట్లు తెలిపారు.
సిలబస్ లేదా పాఠ్య పుస్తకం నుంచి తీసుకున్న అంశం లేదా అధ్యాయానికి సంబంధించిన క్యాలెండర్ ఆసక్తికరమైన మరియు విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంచే కార్యకలాపాలతో కూడిన వారాల వారీ ప్రణాళికను కలిగి ఉంటుందని శ్రీ ఫోఖ్రియాల్ తెలిపారు. ఇది అభ్యాస ఫలితాలతో ఇతివృత్తాలను తెలియజేస్తుందని అన్నారు. దీని ఉద్దేశం, ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు పిల్లల అభ్యాసంలోని పురోగతిని అంచనా వేయడానికి అదే విధంగా పాఠ్యపుస్తకాలలోని పరిజ్ఞానానికి మించి ముందుకు వెళ్ళడమని తెలిపారు. క్యాలెండర్ లో ఇచ్చిన కార్యకలాపాలు అభ్యాస ఫలితాలై దృష్టి కేంద్రీకరిస్తాయని, అందుకే పిల్లలు తమ రాష్ట్రంలో లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉపయోగిస్తున్న పాఠ్యపుస్తకాలతో సహా దీని నుంచి ప్రయోజనం పొందవచ్చని తెలిపారు.
ఆర్ట్స్ ఎడ్యుకేషన్, శారీరక వ్యాయామాలు, యోగా వంటి అనుభవ పూర్వక అభ్యాస కార్యకలాపాలను కూడా ఈ క్యాలెండర్ కవర్ చేస్తుందని శ్రీ ఫోఖ్రియాల్ తెలిపారు. ఈ క్యాలండర్ లో తరగతి వారీగా మరియు విషయాల వారీగా కార్యకలాపాలు పట్టికల రూపాల్లో ఉంటాయని, ఇందులో నాలుగు భాషలకు సంబంధించిన కార్యకలాపాలు అంటే హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ మరియు సంస్కృతం ఉన్నాయని, ఈ క్యాలెండర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులలో ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించే వ్యూహాలకు కూడా చోటు ఇస్తుందని ఆయన తెలిపారు. ఇందులో భారత ప్రభుత్వ పోర్టల్ లోని ఈ- పాఠశాల, ఎన్.ఆర్.ఓ.ఈ.ఆర్, దీక్ష లాంటి వాటికి సంబంధించిన లింక్ ఉంటుందని తెలిపారు.
వీటిని విద్యార్థి ఆసక్తికి అనుగుణంగా సందర్భోచితంగా ఎంచుకోవడమే గాక, విద్యార్థులు ఆసక్తి చూపే అంశాలకు సంబంధించి వారి విద్య మీద ఓ అవగాహన తీసుకురావచ్చు.
స్వయం ప్రభ టీవీ ఛానెళ్ళు (కిశోర్ మంచ్) (ఉచిత డి.టి.హెచ్. ఛానల్ 128, డిష్ టీవి ఛానల్ 950, సన్ డెరక్ట్ -793, జియో టీవీ, టాటాస్కై – 756, ఎయిర్ టెల్ -440, వీడియోకాన్ -477) ద్వారా ఎన్.సి.ఈ.ఆర్.టి. ఇప్పటికే విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులతో ప్రత్యక్ష కార్యక్రమాలను ప్రారంభించింది. అదే విధంగా యూ ట్యూబ్ లైవ్ (ఎన్.సి.ఈ.ఆర్.టి. అఫిషియల్ ఛానల్), సోమవారం నుంచి శనివారం వరకూ ఉదయం 10-30 నుంచి 12-30 వరకూ ప్రాథమిక తరగతులకు, అదే విధంగా మధ్యాహ్నం 12-00 గంటల నుంచి 1-30 వరకూ ఉన్నత ప్రాథమిక తరగతులకు, ఉదయం 9-00 నుంచి 10-30 వరకూ సెకండరీ స్టేజ్ కోసం, మధ్యాహ్నం 2-30 నుంచి 4-00 గంటల వరకూ హయ్యర్ సెకండరీ స్టేజ్ కోసం తరగతులు అందుబాటులో ఉన్నాయి. వీక్షకులతో సంభాషించడం, అంశాల బోధనతో పాటు ఈ కార్యకలాపాలు ప్రత్యక్ష అంశాల్లో ప్రదర్శించడం జరుగుతుంది. ఈ క్యాలెండర్ లు ఎస్.సి.ఈ.ఆర్.టిలు లేదా ఎస్.ఐ.ఈ.లు, డైరక్టరేట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్రీ విద్యాలయ సంఘటన్, కేంద్రీయ విద్యాలయ సమితి, నవోదయ విద్యాలయ సమితి, సి.బి.ఎస్.ఈ, రాష్ట్ర పాఠశాల విద్యా బోర్డులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఏర్పాటు చేసినవి.
ఇది ఆన్ లైన్ బోధన – అభ్యాస వనరులను ఉపయోగించి కోవిడ్ -19 తో వ్యవహరించే విషయంలో సానుకూల మార్గాలను తెలుసుకోవడానికి మరియు అభ్యాస ఫలితాలను సాధించడంలో సహాయ పడేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాలు మరియు తల్లిదండ్రుల చొరవను శక్తివంతం చేయనుంది.
ప్రాథమిక దశ ( 1 నుంచి 5), ఉన్నత ప్రాథమిక దశ ( 6 నుంచి 8), ఉన్నత మాధ్యమిక దశ (9 నుంచి 10) కోసం ప్రత్యామ్నాయ అకాడెమిక్ క్యాలెండర్ ను ఇప్పటికే 2020 ఏప్రిల్ లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి విడుదల చేశారు.
NCERT Alternative Academic Calendars

0 comments:
Post a Comment