National Test Abhyasa జేఈఈ మెయిన్‌, నీట్‌ - 2020 మాక్‌ టెస్టుల కోసం మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ

జేఈఈ మెయిన్‌, నీట్‌ - 2020 మాక్‌ టెస్టుల కోసం మొబైల్‌ యాప్‌ ఆవిష్కరణ

'నేషనల్‌ టెస్ట్‌ అభ్యాస్‌'ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌
మొబైల్‌ యాప్‌ ద్వారా విద్యార్థులు ఉచితంగా మాక్‌ టెస్టుల్లో పాల్గొనే అవకాశం

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, 'నేషనల్‌ టెస్ట్‌ అభ్యాస్‌' పేరుతో కొత్త మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే జేఈఈ మెయిన్‌, నీట్‌ వంటి పరీక్షలు రాయబోయే విద్యార్థులు మాక్‌ టెస్టుల్లో పాల్గొనేలా, ఈ యాప్‌ను ఎన్‌టీఏ రూపొందించింది. అభ్యర్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండి, నాణ్యమైన మాక్ పరీక్షలు రాసేలా యాప్‌ను రూపొందించారు. లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలు, ఎన్‌టీఏకు చెందిన 'పరీక్ష సాధన కేంద్రాలు' మూతబడిన కారణంగా, విద్యార్థులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఈ యాప్‌ను ఎన్‌టీఏ అభివృద్ధి చేసింది.

    ప్రపంచవ్యాప్తంగా జీవన విధానాల్లో గణనీయ మార్పులకు దారితీసిన ఈ సమయంలోనూ, విద్యార్థుల కోసం రూపొందించిన యాప్‌ ద్వారా, కీలకమైన పరీక్షల సన్నద్ధతలో సమానత్వపు సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో భారతదేశం ముందడుగు వేసింది.

    దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు 'నేషనల్‌ టెస్ట్‌ అభ్యాస్‌' యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉచితంగా అధిక నాణ్యమైన మాక్‌ టెస్టులు రాయవచ్చు. జేఈఈ, నీట్‌ సహా అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధమవ్వచ్చు. మాక్‌ టెస్టులను సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకుని ఆఫ్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. దీనివల్ల ఇంటర్నెట్‌ వినియోగ భారం కూడా తగ్గుతుంది.

    యాప్‌ ఆవిష్కరణ సందర్భంగా హెచ్‌ఆర్‌డీ మంత్రి మాడ్లాడుతూ, "సన్నద్ధత లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి పరీక్షల్లో వెనుకబడకుండా సరైన సమయంలో ఈ యాప్‌ను తీసుకొచ్చాం. లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలు, ఎన్‌టీఏకు చెందిన 'పరీక్ష సాధన కేంద్రాలు' మూతబడిన కారణంగా, విద్యార్థులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి యాప్‌ ఉపయోగపడుతుంది." అన్నారు.

    నేషనల్‌ టెస్ట్‌ అభ్యాస్‌


    భారతదేశంలోని విద్యార్థులందరికీ, వారి వద్దవున్న ఫోన్ల స్థాయి, నెట్‌వర్క్ నాణ్యతతో సంబంధం లేకుండా, స్మార్ట్‌ఫోన్‌లు లేదా కంప్యూటర్లలో ప్రాక్టీస్ పరీక్షలను ఈ యాప్‌ అందుబాటులోకి తెస్తుంది. విద్యార్థులు టెస్ట్‌ పేపర్లను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇంటర్‌నెట్‌తో సంబంధం లేకుండా ఆఫ్‌లైన్‌లో పరీక్షలు రాయవచ్చు. ఆండ్రాయిడ్‌ ద్వారా పనిచేసే మొబైల్‌ ఫోన్లు, ట్యాబుల్లో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 'నేషనల్‌ టెస్ట్‌ అభ్యాస్‌' యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఐవోఎస్‌ ఫోన్లలోనూ డౌన్‌లోడ్‌ చేసుకునేలా త్వరలోనే అందుబాటులోకి తెస్తారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత కొన్ని ప్రాథమిక వివరాలు నమోదు చేసి యాప్‌లో అకౌంట్‌ నమోదు చేసుకోవచ్చు. తర్వాత, వారు కోరుకున్న పరీక్షల్లో ఉచితంగా మాక్‌టెస్టుల్లో పాల్గొనవచ్చు.
విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకుని ఆఫ్‌లైన్‌ ద్వారా పరీక్ష రాసేలా, ప్రతిరోజూ ఒక కొత్త పరీక్ష పేపర్‌ను యాప్‌లో విడుదల చేయాలని ఎన్‌టీఏ భావిస్తోంది. ఆఫ్‌లైన్‌లో పరీక్ష రాసిన తర్వాత, విద్యార్థులు ఆన్‌లైన్‌ మోడ్‌లో పేపర్‌ సబ్మిట్‌ చేసి, ఫలితాలను చూసుకోవచ్చు. "ఈ యాప్‌ వల్ల ప్రధాన ఉపయోగం ఏమిటంటే విద్యార్థి పరీక్ష పేపర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇంటర్‌నెట్‌ లేకుండా కూడా ఇది సంపూర్ణంగా పనిచేస్తుంది. తక్కువ ఇంటర్‌నెట్‌ బ్యాండ్‌విడ్త్‌ ఉన్న ప్రాంతాల్లోని విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని రుజువవుతుంది. ఒకేసారి ఎక్కువమంది ఆన్‌లైన్‌ పరీక్షల్లో పాల్గొంటే ఏర్పడే అడ్డంకులు కూడా ఇందులో ఉండవు" అని మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్ చెప్పారు. దీంతోపాటు, విద్యార్థులకు విస్తృతమైన సాయం కోసం http://nta.ac.in/abhyas/help ను ఎన్‌టీఏ ఏర్పాటు చేసింది. యాప్‌ విడుదలైన నాటి నుంచి ఏడు రోజులపాటు, విద్యార్థులకు ఏమైన ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరించడానికి ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు.

    గత ఏడాది కాలంలో.. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్ వంటి అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడంలో ఎడ్యుటెక్ రంగం చాలా నూతన ఆవిష్కరణలను సాధించింది. పరిజ్ఞానం, టెస్ట్ టేకింగ్ స్ట్రాటజీల్లో అంతరాలను గుర్తించడానికి, వాటిని అధిగమించడానికి ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన, నిర్దిష్ట మార్గదర్శకత్వం అవసరం. ఎన్‌టీఏ మాక్ టెస్ట్ యాప్‌లోని పరీక్ష నివేదిక విద్యార్థుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తుంది. దీని ద్వారా వారు ప్రవేశ పరీక్షలో మెరుగైన మార్కులు సాధించడానికి సరైన మార్గాన్ని అర్థం చేసుకోవచ్చు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top