గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

▪️ఒక్కో బస్సులో 20 మందినే అనుమతించాలని సీఎం స్పష్టం చేశారు

▪️ప్రయాణికులందరూ మాస్క్‌ ధరించే విధంగా విధివిధానాలు రూపొందించాలని సీఎం ఆదేశం

▪️ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించింది

▪️విజయవాడ, విశాఖ, తిరుపతితో పాటు ప్రధాన నగరాలను కలిపే సర్వీసులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

▪️ ప్రతీ జిల్లా కేంద్రాన్ని మరో జిల్లా కేంద్రంతో కలిపేలా సర్వీసుల పునరుద్ధరణ ఉండబోతోంది.

స్పందన పోర్టల్‌లో మొబైల్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకుని, వారి అభ్యర్థనను జిల్లా అధికార యంత్రాంగం అంగీకరించిన వారికే ఏపీఎస్‌ఆర్టీసీలో ప్రస్తుతం టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించడం గమనార్హం. ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది

నిబంధనలు ఇవే :


*ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలి, శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలి.
*బస్సు ఎక్కే ముందే టికెట్లు ఇస్తారు. మధ్యలో ఇచ్చే ప్రసక్తే లేదు.
*థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాకే బస్సు కదులుతుంది.
*భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి.
*పిల్లలు, వృద్ధులు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకూడదు.
*నగదు రహిత చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యం

బస్సుల పని తీరు :

*సూపర్ లగ్జరీ,డీలక్స్, ఎక్స్‌ప్రెస్,పల్లెవెలుగు బస్సులు నడుస్తాయి.
*రోజు 12 గంటల పాటు మాత్రమే సేవలు.
*ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకే పరిమితం.
*విజయవాడ , విశాఖలో సిటీ బస్సులు నడపరు.
*ఏసీ, సిటీ బస్సులు డిపోలకే పరిమితం.
*అందుబాటులోకి ఆన్‌లైన్ రిజర్వేషన్స్ సౌకర్యం.
*కొంత కాలం బస్సుల్లో ఆన్ బోర్డు కండక్టర్లు ఉండరు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top