కేంద్ర మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ సూచన మేరకు అవకాశం పొడిగింపు
19.05.2020 నుంచి 24.05.2020 వరకు అందుబాటులో దరఖాస్తు ఫారం
విదేశాల్లో చదవాలనుకుని, ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల కారణంగా మనసు మార్చుకుని, జేఈఈ (మెయిన్)-2020 రాసి భారతదేశంలోనే విద్యను కొనసాగించాలనుకుంటున్న విద్యార్థులకు మరో అవకాశం లభించింది. విద్యార్థుల విజ్ఞప్తుల దృష్ట్యా, జేఈఈ (మెయిన్) దరఖాస్తు నింపడానికి విద్యార్థులకు మరో ఆఖరి అవకాశం ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)కి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ సూచించారు. ఏ ఇతర కారణంగానైనా దరఖాస్తును నింపలేకపోయిన లేదా పంపలేకపోయిన ఇతర విద్యార్థులకు కూడా ప్రస్తుత అవకాశం వర్తిస్తుంది.
కొవిడ్ కారణంగా విద్యార్థులు ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా కేంద్ర మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ఇచ్చిన సూచన మేరకు, జేఈఈ (మెయిన్) దరఖాస్తు ఫారం పూర్తి చేయడానికి, పంపడానికి విద్యార్థులకు మరో ఆఖరి అవకాశాన్ని ఎన్‌టీఏ ఇచ్చింది.
దరఖాస్తు నింపడానికి, పంపడానికి jeemain.nta.nic.infrom వెబ్‌సైట్‌లో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. 19.05.2020 నుంచి 24.05.2020 వరకు మాత్రమే ఈ అవకాశం ఉంది. పూర్తి చేసిన దరఖాస్తును సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఫీజు చెల్లించేందుకు రాత్రి 11.50 గం. వరకు అనుమతిస్తారు. ఫీజును క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ లేదా పేటీఎం ద్వారా చెల్లించవచ్చు.
మరింత స్పష్టత కోసం, jeemain.nta.nic.in లో ఉన్న సమాచార బులెటిన్‌ను విద్యార్థులు చూడాలి. కొత్త సమాచారం కోసం, jeemain.nta.nic.in మరియు www.nta.ac.infor వెబ్‌సైట్లను విద్యార్థులు, తల్లిదండ్రులు చూస్తుండాలి. 8287471852, 8178359845, 9650173668, 9599676953 మరియు 8882356803 నంబర్లకు ఫోన్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు లేదా, jeemain@nta.ac.infor కు ఈమెయిల్ పంపవచ్చు.

0 comments:
Post a Comment