చదువులకో టీవీ ఛానల్‌!

చదువులకో టీవీ ఛానల్‌!

★ విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ప్రత్యేక టీవీ ఛానల్‌ ఏర్పాటుకు సమగ్రశిక్ష అభియాన్‌ కేంద్రానికి ప్రతిపాదించింది.

★ 24గంటలు విద్యపై పని చేసే టీవీ ఛానల్‌ను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.

★ ఛానల్‌ ఏర్పాటుకు రూ.3కోట్లు, నిర్వహణకు ఏడాదికి రూ.40 లక్షల నుంచి రూ.50లక్షలు అవసరమవుతాయని అంచనా వేసింది.

ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు..

★ ఈ ఏడాది సమగ్ర శిక్ష అభియాన్‌ కింద రూ.3వేల కోట్ల బడ్జెట్‌కు ప్రతిపాదనలు రూపొందించింది.
★ అందులో కొవిడ్‌-19 కారణంగా ఒక్కో విద్యార్థికి ఏడాదికి పది మాస్కులు, ఆరు శానిటైజర్‌ సీసాలు అవసరమని అంచనా వేసింది. తరగతి గదుల పారిశుద్ధ్యానికి ప్రత్యేక నిధులు ప్రతిపాదించింది.
★ ఈ ఏడాది 9, 10 తరగతుల విద్యార్థులకూ ఏకరూప దుస్తులు ఇవ్వాలని పేర్కొంది. * జూన్‌ 9న కేంద్ర ప్రాజెక్టు అనుమతుల బోర్డు(పీఏబీ) వీడియో కాన్ఫరెన్సులో ఈ ప్రతిపాదనలపై నిర్ణయం వెల్లడించనుంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top