ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 20 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక సమగ్ర ప్యాకేజ్ని 2020 మే 12న ప్రకటించారు. ఇది భారతదేశ జిడిపిలో పదిశాతం. ప్రధానమంత్రి ఈ సందర్బంగా ఆత్మనిర్భర భారత్అభియాన్ లేదా స్వావలంబిత భారత్ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆయన ఆత్మనిర్భర భారత్‌కు సంబంధించిన ఐదు స్తంభాల గురించి ప్రస్తావించారు. అవి ఆర్థిక, మౌలిక సదుపాయాలు, వ్యవస్జత, చైతన్యవంతమైన జనాభా, డిమాండ్
కేంద్ర ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, ఈరోజు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ స్ట్రక్చరల్ సంస్కరణలు నేటి ప్రకటనల్లో కీలకమైనవని అన్నారు. అనేక రంగాలలో విధాన పరమైన సరళీకరణ అవసరమని ఆమె అన్నారు. ఏ రంగం ఏమివ్వగలదో ప్రజలు సులభంగా అర్థం చేసుకోవడానికి, వాటి కార్యకలాపాల్లో పాల్గొనడానికి, పారదర్శకతకు సులభతర విధానాలు అవసరమన్నారు. మనం ఒకసారి ఈ రంగాలకు సంబంధించిన అడ్డంకులు తొలగించిన తర్వాత, ప్రగతిసాధన కోసం ఈ రంగాలను ముందుకు తీసుకుపోగలమని ఆర్థిక మంత్రి తెలిపారు.
ఒక పద్ధతి ప్రకారం లోతైన వ్యవస్థీకృత సంస్కరణలు తీసుకురావడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి మంచి బలమైన రికార్డు ఉందని అంటూ ఆర్థికమంత్రి, పలు సంస్కరణలను ప్రస్తావించారు. ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ఇందుకు ఉదాహరణ అని అలగే జిఎస్టి సంస్కరణలు ఒక దేశం, ఒక మార్కెట్‌ను తీసుకువచ్చాయని, ఇన్‌సాల్వెన్సీ, దివాలా కోడ్ (ఐబిసి) ఇన్‌సాల్వెన్సీ సమస్యలను పరిష్కరించిందని, సులభతర వాణిజ్యానికి పలు చర్యలు తీసుకున్నారని చెప్పారు.
సత్వర పెట్టుబడులకు విధానపరమైన సంస్కరణల తీసుకురావలసిన అవసరం గురించి, ఈ దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈరోజు మీడియా ప్రతినిధుల సమావేశంలోవివరించారు..
ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీల ద్వారా ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ లు జరుగుతున్నాయని , పెట్టుబడి వచ్చే ప్రాజెక్టులను సిద్ధం చేయడానికి పెట్టుబడిదారులతో , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవడానికి ప్రతి మంత్రిత్వ శాఖలో ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
ఆత్మ నిర్భర్ భారత్ దిశగా పెట్టుబడులను వేగంగా ట్రాక్ చేయడానికి క్రింది విధాన సంస్కరణలను ఆర్థిక మంత్రి ప్రకటించారు:
ఎ. సాధికారతా గ్రూప్ కార్యదర్శుల ద్వారా పెట్టుబడి క్లియరెన్సుల ఫాస్ట్ ట్రాకింగ్ ఉంటుంది.
బి. పెట్టబడులు పెట్టే ప్రాజెక్టుల రూపకల్పనకు ప్రతి మంత్రిత్వశాఖ స్థాయిలో ఇన్వెస్టర్లను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం సాధించడానికి ఒక ప్రాజెక్ట్ డవలప్‌మెంట్ సెల్‌ను ఏర్పాటు చేస్తారు.
సి. కొత్త పెట్టుబడులకు సంబంధించి పెట్టుబడుల ఆకర్షణీయతలో పొటీపడడానికి రాష్ట్రాలకు ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది.
డి. సౌర పివి తయారీ ,అడ్వాన్స్‌డ్ సెల్ బ్యాటరీ స్టోరేజ్ వంటి రంగాలలో కొత్త ఛాంపియన్ సెక్టార్ల ను ప్రోత్సాహించేందుకు ఇన్సెంటివ్ పథకాలు ప్రారంభించబడతాయి;.
సాధారణ మౌలిక సదుపాయాల సౌకర్యాలు , అనుసంధానతకు సంబంధించి పారిశ్రామిక క్లస్టర్ అప్‌గ్రేడేషన్ కోసం ఛాలెంజ్ మోడ్ ద్వారా రాష్ట్రాల్లో ఒక పథకం అమలు చేయనున్నట్టు శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త పెట్టుబడులను ప్రోత్సహించడానికి ,జిఐఎస్ మ్యాపింగ్‌తో పారిశ్రామిక సమాచార వ్యవస్థ (ఐఐఎస్) పై సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పారిశ్రామిక భూమి , ల్యాండ్ బ్యాంకులు అందుబాటులో ఉంటాయి..
ఐదు లక్షల హెక్టార్లలో 3376 పారిశ్రామిక పార్కులు , ఎస్టేట్లు,సెజ్‌లు ఐఐఎస్‌లో మ్యాప్ చేశారు. అన్ని పారిశ్రామిక పార్కులకు 2020-21 మధ్య ర్యాంకులు ఉంటాయి.
బొగ్గు, ఖనిజాలు, రక్షణ ఉత్పత్తి, పౌర విమానయానం, విద్యుత్ రంగం, సామాజిక మౌలిక సదుపాయాలు, అంతరిక్ష, అణు ఇంధనం వంటి ఎనిమిది రంగాల్లో ఈ క్రింది స్ట్రక్చరల్ సంస్కరణలను ఆర్థిక మంత్రి ఈ రోజు ప్రకటించారు. వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
ఎ . బొగ్గు రంగం:
1. బొగ్గు రంగంలొ వాణిజ్య మైనింగ్ ను ప్రవేశపెట్టడం
బొగ్గు రంగంలో కింది చర్యల ద్వారా పోటీ, పారదర్శకత, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది
(ఎ)స్థిర రూపాయి / టన్నుల లెక్క విధానానికి బదులుగా ఆదాయ భాగస్వామ్య విధానం. ఎవరైనా బొగ్గు బ్లాక్ కోసం బిడ్ వేయవచ్చు. , బహిరంగ మార్కెట్లో అమ్మవచ్చు
బి) ప్రవేశ నిబంధనలు సరళీకృతం చేస్తారు. దాదాపు 50 బ్లాక్‌లు వెంటనే ఇవ్వబడతాయి. ఎటువంటి అర్హత షరతులు ఉండవు, సీలింగ్‌తో అప్‌ఫ్రంట్ చెల్లింపు సదుపాయం మాత్రమే కల్పిస్తారు.
(సి) అణ్వేషణ పూర్తి చేసిన బొగ్గు బ్లాకులను మాత్రమే వేలం వేసే పూర్వపు నిబంధనలకు బదులుగా, పాక్షికంగా అణ్వేషించిన బ్లాకుల కోసం ఎక్స్‌ప్లొరేషన్-కమ్-ప్రొడక్షన్ విధానం ఉంటుంది. ఇది బొగ్గు బ్లాకుల అన్వేషణలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని అనుమతిస్తుంది.
డి) షెడ్యూల్ కంటే ముందే ఉత్పత్తి జరిగితే, రెవెన్యూ-వాటాలో రిబేటు ద్వారా ప్రోత్సహిస్తారు
2. బొగ్గు రంగంలో వైవిధ్యం తో కూడిన అవకాశాలు:
ఎ) రాబడి వాటాలో రిబేట్ ద్వారా బొగ్గు గ్యాసిఫికేషన్, ద్రవీకరణ ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది పర్యావరణ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తుంది గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మారడానికి ఇది భారతదేశానికి సహాయపడుతుంది.
బి) 2023-24 నాటికి 1 బిలియన్ టన్నుల అదనపు బొగ్గు ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించుకున్న కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) అలాగే ప్రైవేటు బ్లాక్ ల నుంచి బొగ్గు ఉత్పత్తిని తరలించడానికి న 50,000 కోట్ల రూపాయలతో అవసరమైన మౌలికసదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. ఇందులో బొగ్గును గనుల నుంచి రైల్వై సైడింగ్‌లకు (కన్వేయర్ బెల్ట్) మీదుగా యాంత్రిక తరలింపు రంగంలో రూ 18,000 కోట్ల పెట్టుబడి కూడా ఇమిడి ఉంది. ఇది పర్యావరణంపై పడే ప్రభావాన్ని తగ్గించడానికి ఉపకరిస్తుంది.
3. బొగ్గురంగంలో సరళీకృత పాలనా విధానం
ఎ. కోల్ బెడ్ మీథేన్ (సిబిఎం) వెలికితీత హక్కులను, కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) బొగ్గు గనుల నుండి వేలం వేస్తుంది
(బి) మైనింగ్ ప్లాన్ సరళీకరణ వంటి సులభతర వ్యాపారానికి సంబంధించిన చర్యలు తీసుకుంటారు. ఇది వార్షిక ఉత్పత్తిలో 40
శాతం ఆటోమేటిక్ పెరుగుదలను అనుమతిస్తుంది.
సి) సిఐఎల్ వినియోగదారులకు వాణిజ్య పరమైన రాయితీల కల్పన. (5,000 కోట్ల రూపాయల విలువైన ఉపశమనం).
నాన్ పవర్ వినియోగదారుల కోసం వేలంలో రిజర్వ్ ధర తగ్గించడం జరిగింది. క్రెడిట్ నిబంధనలు సడలించారు. అలాగే లిఫ్టింగ్ సమయం పెంచడం జరిగింది

0 comments:
Post a Comment