దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులతో వెబినార్ ద్వారా సంభాషించిన - కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఈ రోజు న్యూఢిల్లీ నుండి వెబ్‌నార్ ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులతో సంభాషిస్తూ 'ఆచార్య దేవో భవ' సందేశం ఇచ్చారు. విద్యార్థులు మరియు సమాజంలో కోవిడ్-19 కు సంబంధించిన అవగాహనను వ్యాప్తి చేసినందుకు ఉపాధ్యాయులందరికీ మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు ఈ వెబ్‌నార్ కార్యక్రమంలో పాల్గొని, కేంద్ర మంత్రిని ప్రశ్నలు కూడా అడిగారు.
ఈ వెబినార్ సందర్భంగా కేంద్రమంత్రి రెండు భారీ ప్రకటనలు చేశారు. జాతీయ అర్హత పరీక్ష (ఎన్.ఈ.టి.) 2020 తేదీని త్వరలో ప్రకటిస్తామని, ఆయన, ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నవోదయ విద్యాలయ నియామక ప్రక్రియ పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులు లాక్ డౌన్ తర్వాత నియామక పత్రాలను అందుకుంటారని కూడా అయన ప్రకటించారు.
లాక్ డౌన్ సమయంలో కూడా ఉపాధ్యాయులందరూ తమ విధులను నిర్వర్తించాలనీ, విద్యార్థుల విద్యా సంక్షేమాన్ని నిర్ధారించాలనీ కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో, గురువు యొక్క ప్రాముఖ్యత ఎల్లప్పుడూ దేవుని కంటే ఎక్కువగా ఉంటుందనీ, అందుకే ఆచార్య దేవో భవ యొక్క భావనను కాపాడుకునే ఉపాధ్యాయులందరినీ మనం గౌరవించాలనీ ఆయన అన్నారు. ఈ సంక్షోభంలో ఉపాధ్యాయులు కూడా ముందుండి పనిచేశారనీ, వారి పని ఎంతో ప్రశంసనీయమనీ ఆయన అన్నారు.
ఈ సమయంలో దేశం అసాధారణమైన ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కుంటోందని ఎదుర్కొంటుందని శ్రీ పోఖ్రియాల్ అన్నారు. తల్లిదండ్రులకు వారి స్వంత సమస్యలు ఉన్నాయి. విద్యార్థులకు వారి స్వంత సమస్యలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికీ ఇది చాలా కష్టమైన సమయం. ఒకేసారి చాలా మంది పిల్లల యోగ క్షేమాలు చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయుని పై ఉంటుంది. అతను పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది. చూసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు, ఇది ప్రశంసనీయం.
ఈ సందర్భంగా, శ్రీ పోఖ్రియాల్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు చేసిన ప్రయత్నాల వల్ల, దేశంలోని ఆన్ లైన్ విద్యా విధానం విజయవంతమైనట్లు రుజువయ్యిందని అన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు సాంకేతికతతో నిపుణులు కాకపోయినప్పటికీ, వారు విద్యార్థుల ప్రయోజనం కోసం తమ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని, ఆన్‌లైన్ విద్యకు తోడ్పడ్డారు. ఏ దేశ ఉపాధ్యాయుడు బలంగా, బాధ్యతాయుతంగా ఉంటారో, ఆ దేశం ఎల్లప్పుడూ అభివృద్ధి మార్గంలో పయనిస్తుందన్న విషయం, ఈ సంక్షోభ కాలంలో మరింత ధృవపడింది. ఢిల్లీలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కరోనా వైరస్ కారణంగా మృతి చెందడం పట్ల కేంద్ర మంత్రి సంతాపం వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ అనంతరం, పాఠశాలల ప్రారంభానికి సంబంధించిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పాఠశాల స్థాయిలో అన్ని వాటాదారుల యొక్క నిర్దిష్ట పాత్రలు మరియు బాధ్యతలను నిర్వచించడం వంటి వివిధ పనులను పాఠశాల పరిపాలన సిబ్బంది మరియు ఉపాధ్యాయులు నిర్వహిస్తారని మంత్రి తెలియజేశారు. పాఠశాలలు తెరవడానికి ముందు మరియు తరువాత ఆరోగ్యం, పారిశుధ్యం మరియు ఇతర భద్రతా నియమాలు మరియు ప్రామాణిక విధి విధానాలు (ఎస్.ఓ.పి. లు) నిర్వచించడం, నిర్వహించడం చేయాలి. పాఠశాల క్యాలెండర్, వార్షిక పాఠ్య ప్రణాళికలను పునర్నిర్వచించి, సర్దుబాటు చేయాలి. లాక్ డౌన్ సమయంలో ఇంటి నుండి కొనసాగిన ఆన్ లైన్ పాఠశాల నుండి అధికారిక పాఠశాలకు విద్యార్థులు సజావుగా మారడంతో పాటు వారి మానసిక శ్రేయస్సును నిర్ధారించాలి.
వారు ఏదైనా కోల్పోకుండా చూసుకోవడానికి పాఠశాల చెక్ లిస్ట్ లను సిద్ధం చేస్తుందని ఆయన అన్నారు. సి.బి.ఎస్.ఇ. త్వరలో ఆ చెక్ లిస్టులను పంచుకోనుంది.
ఉపాధ్యాయుల నియామకాల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, కేంద్రీయ విద్యాలయాలలో 8,000 కి పైగా నియామకాలు జరిగాయని, నవోదయ విద్యాలయాలలో దాదాపు 2500 నియామకాలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. విశ్వవిద్యాలయాల్లో 12,000 మందికి పైగా ఉపాధ్యాయులను నియమించినట్లు ఆయన తెలిపారు. నవోదయ విద్యాలయ నియామక ప్రక్రియలో ఎంపికైన ఉపాధ్యాయులకు లాక్ డౌన్ ముగిసిన తర్వాత నియామక లేఖలు లభిస్తాయి. ఉపాధ్యాయుల పోస్టులను ఖాళీగా ఉంచకూడదని మన ప్రభుత్వం విశ్వసిస్తోందని, త్వరలో ఖాళీలను భర్తీ చేయడానికి మంత్రిత్వ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని శ్రీ పోఖ్రియాల్ తెలిపారు.
ఉపాధ్యాయ శిక్షణపై ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ఆన్ లైన్ విద్యావ్యవస్థ కోసం ఉపాధ్యాయుల శిక్షణ పూర్తి సంసిద్ధతతో జరుగుతోందని, లక్షలాది మంది ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నారని అన్నారు. పండిట్ మదన్ మోహన్ మాలవ్యా జాతీయ ఉపాధ్యాయ శిక్షణా మిషన్ (పి.ఎమ్.ఎమ్. ఎమ్.ఎన్.ఎమ్.టి.టి.) అభ్యాస వనరుల ఉపయోగం కోసం ఉపాధ్యాయుల శిక్షణను నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో ఉపాధ్యాయుల భాగస్వామ్యం పెరిగిందని కూడా మంత్రి తెలియజేశారు. విద్యార్థులకు నేర్పడానికి తమను తాము కొత్త టెక్నాలజీలతో అనుసంధానించుకోవడానికి ఉపాధ్యాయులు సుముఖత వ్యక్తం చేశారు.
సామాజిక దూరం మొదలైన వాటికి సంబంధించిన ఆరోగ్య శాఖ సూచించిన మార్గదర్శకాలను ఓపికగా పాటించినందుకూ, ఈ మార్గదర్శకాలను అనుసరించడానికి విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రేరేపించినందుకూ, ఉపాధ్యాయులందరికీ మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్-19 కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధంలో పూర్తి చిత్తశుద్ధితో పాల్గొంటున్నందుకు మంత్రి ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యకు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన సమస్యలపై ఉపాధ్యాయులందరూ తమ సూచనలను ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పంపాలని ఆయన కోరారు.

0 comments:
Post a Comment