10వ తరగతి విద్యార్థులకు - వాట్సాప్ పాఠాలు

 ‘వాట్సాప్ పాఠాలు’...

⇨ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. పదవ తరగతి చదువుతున్న విద్యార్ధులకు... సిలబస్‌ను వాట్సాప్ సహా ఇతరత్రా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా అందించాలని నిర్ణయం.

⇨  ప్రతీ పాఠశాలకూ ఓ ‘వాట్సాప్ గ్రూప్’ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. విద్యార్ధులు, టీచర్లు... ఒక గ్రూపులో ఉంటారు.

⇨ పదవ తరగతి పరీక్షల కోసం... విద్యార్ధులకు అవసరమైన ప్రాక్టీస్ ప్రశ్నలను వాట్సాప్ మీడియా ద్వారా అందించనున్నట్లు సమాచారం.

⇨ మొత్తం పాతిక వేల మంది వరకు విద్యార్ధులు, మరో 933 మంది ఉపాధ్యాయులు గ్రూపులో చేరాల్సి ఉంటుంది.

⇨ ఉపాధ్యాయులు తమ క్లాసులను వీడియో రికార్డ్ చేసి ‘ యూ ట్యూబ్‌’లో అప్‌లోడ్ చేస్తారు.

⇨ సంబంధిత ‘యూఆర్‌ఎల్ లింక్’లను వాట్సాప్ గ్రూప్ లేదా ‘ఈ-మెయిల్’ ద్వారా విద్యార్ధులకు పంపుతారు. ఆ వీడియోల ద్వారా విద్యార్ధులు... తరగతులను ఫాలో కావాల్సి ఉంటుంది.

⇨ విద్యార్ధులు తాము తయారు చేసుకునే నోట్స్‌ను కూడా వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఉపాధ్యాయులకు పంపాల్సి ఉంది.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top