పెద్ద సంఖ్య‌లో గ‌ల విద్యార్థుల ప్ర‌యోజ‌నం దృష్ట్యా 10 వ‌త‌ర‌గ‌తి, 12 వ త‌ర‌గ‌తి బోర్డుప‌రీక్ష‌ల‌కు లాక్‌డౌన్ చ‌ర్య‌ల‌నుంచి మిన‌హాయింపు : శ్రీ‌ అమిత్ షా

పెద్ద సంఖ్య‌లో గ‌ల విద్యార్థుల ప్ర‌యోజ‌నం దృష్ట్యా 10 వ‌త‌ర‌గ‌తి, 12 వ త‌ర‌గ‌తి బోర్డుప‌రీక్ష‌ల‌కు లాక్‌డౌన్ చ‌ర్య‌ల‌నుంచి మిన‌హాయింపు : శ్రీ‌ అమిత్ షా

ప‌రీక్షల షెడ్యూళ్ళు వేర్వేరు తేదీల‌లో ఉండేలా చూడ‌నున్న ప‌లు బోర్డులు. ఆరోగ్యం, ప‌రిశుభ్ర‌త విధివిధానాలు పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి.
పెద్ద సంఖ్య‌లోగ‌ల విద్యార్థుల ప్ర‌యోజ‌నాలను దృష్టిలో ఉంచుకుని, 10 వ త‌ర‌గ‌తి, 12  వ త‌ర‌గ‌తి బోర్డు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు లాక్‌డౌన్ చ‌ర్య‌ల‌నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు కేంద్ర హోం వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

    లాక్‌డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాల కింద పాఠ‌శాల‌లు నిర్వ‌హించ‌డాన్ని నిషేధించినందున , రాష్ట్ర విద్యాబోర్డులు, సిబిఎస్ి, ఐసిఎస్ఇ త‌దిత‌ర సంస్థ‌లు నిర్వ‌హించాల్సిన‌  10వ త‌ర‌గ‌తి, 12 వ త‌ర‌గ‌తి వార్షిక‌ ప‌రీక్ష‌లునిర్వ‌హించ‌డాన్ని నిలిపివేయ‌డం జరిగింది. అయితే వివిధ రాష్ట్రాలు, సిబిఎస్ నుంచి బోర్డు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తులు అందాయి.
దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని హోం వ్య‌వ‌హారాల శాఖ (ఎం.హెచ్‌.ఎ) అన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి పాటించాల్సిన విధివిధానాల‌పై  లేఖ రాసింది.  అవి:
కంటైన్‌మెంట్ జోన్‌ల‌లో ప‌రీక్షా కేంద్రాన్నిఅనుమ‌తించ‌రు.
టీచ‌ర్లు , సిబ్బంది, విద్యార్థులు ముఖానికి మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాలి.
థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ ఏర్పాటు , శానిటైజ‌ర్ ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద ఉండాలి.అన్ని ప‌రీక్షా కేంద్రాల‌లో సామాజిక దూరం పాటించాలి.
 వివిధ బోర్డులు ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉన్నందున వారి ప‌రీక్షా షెడ్యూళ్ళు వేరు వేరుగా ఉండాలి.
ప‌రీక్షా కేంద్రాల‌కు విద్యార్థుల‌ను చేర‌వేయ‌డానికి ప్ర‌త్యేక బ‌స్సులను రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయ‌వ‌చ్చు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top