GIS Group Insurance Scheme గ్రూప్ ఇన్స్యూరెన్స్ పథకం (GIS)

GIS Group Insurance Scheme  గ్రూప్ ఇన్స్యూరెన్స్ పథకం (GIS)

     గతంలో అమలులో వున్న 'కుటుంబ సంక్షేమ పథకం' స్థానంలో జిఓ. ఎం ఎస్. నం. 293 ఆర్థిక, తేది. 08.10.1984 ద్వారా “ఆం.ప్ర. ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్స్యూరెన్స్ స్కీము 1984"  (G.I.S) 01.11.1984 నుండి ప్రవేశ పెట్టబడింది.

నిబంధనలు : 

01.11.1984 నాటికి సర్వీసులో గల ప్రభుత్వ, పంచాయితీరాజ్, మున్సిపల్ ఉద్యోగులు మరియు 10
సం||లు నిండి ప్రభుత్వోద్యోగులుగా మారిన వర్క్ చార్జిడ్ ఉద్యోగులు ఈ పథకంలో సభ్యులు. 01.11.1984 తర్వాత సర్వీసులో చేరినవారు తదుపరి నవంబరు నుండి మాత్రమే సభ్యుల గుదురు. అయితే అట్టివారు ఇన్స్యూరెన్స్ కవర్ చేయడానికి వారు ఏ గ్రూపుకు చెందుతారో దానిని బట్టి ప్రతి 10/-ల యూనిట్‌కు రు. 3లను, ప్రతి  150 యూనిట్‌కు 4.50 లను తదుపరి నవంబరు వరకు చెల్లించాలి.  ఉద్యోగి ఫారం 6 లేక 7లో యిచ్చిన నామినేషన్ సర్వీసు రిజిష్టరులో అంటించి,నమోదు చేయాలి.
ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి జిఓ. ఎంఎస్.నం. 315 విద్యాశాఖ, తేదీ. 22.07.1986 ద్వారా ఇటువంటి స్కీమే 01.07.1986 నుండి వర్తింప చేయబడింది. అయితే ఎయిడెడ్ పాఠశాలలకు ఎల్‌ ఐ సి వారే నేరుగా ప్రీమియంలు వసూలు చేసి, చనిపోయిన వారికి డబ్బు చెల్లిస్తారు. ఎయిడెడేతర ఉపాధ్యాయులకు ఎల్ ఐ సి తో  నేరుగా సంబంధం లేదు. యుటిఎఫ్.

సభ్యత్వ రుసుం:

 ఉద్యోగులు ఎ, బి, సి, డి అను నాల్గు గ్రూపులుగా విభజించబడుదురు.0 1.11, 1994 నుండి యూనిట్ సభ్యత్వ రుసుం జిఓ. ఎంఎస్.నం. 367 ఆర్థిక, తేది. 15. 11. 1994 ద్వారా - 16/-లుగా పెంచబడినది. 2010 పీఆర్‌సీలో జిఓ.ఎంఎస్.నం. 225, తేది. 22.06.2010 ప్రకారం సభ్యత్వ రుసుం  చెల్లించవలయును.
2015 వేతన స్కేళ్లలో
35120-110850 స్కేళ్ల వారు సభ్యత్వ రుసుము    రు.120/- లు,
23100-84970 స్కేళ్ల వారు రు.60/- లు,
16400-66330 స్కేళ్ల వారు రు. 30/- లు,
13000-47330 స్కేళ్ల వారు రు.16/- లు చెల్లించాలి.

సభ్యత్వ గ్రూపు మార్పు: 

ఒక ఉద్యోగి సంవత్సరం మధ్యలో పొందిన రెగ్యులర్ ప్రమోషన్ లేక నియామకం వలన అతని
వేతన స్కేలు గరిష్ట పరిమితి మారినను తదుపరి నవంబర్ నుండి మాత్రమే అతని సభ్యత్వం గ్రూపు మారుతుంది. ఎయిడెడ్వారి విషయంలో జులై నుండి మాత్రమే మారుతుంది. ప్రమోషన్ వెనుకటి తేదీ నుంచి అమలులోనికి వచ్చినప్పటికి సభ్యత్వ గ్రూపు వెనుకటి తేదీ నుండి మారదు.

ఇన్స్యూరెన్స్ లేక సేవింగ్స్ ఖాతాలకు జమ : 

ఉద్యోగి చెల్లించే ప్రతి యూనిట్ - 10/- నుండి - 3.125 ఇన్స్యూరెన్స్ ఖాతాకు,  6.875 సెవింగ్స్ ఖాతాకు మారుతుంది. అట్లే ప్రతి  15/-ల యూనిట్ నుండి  4.50లు ఇన్స్యూరెన్స్ ఖాతాకు,10.50/-లు సేవింగ్స్ ఖాతాకు జమచేస్తారు.

ఇన్స్యూరెన్సు & సేవింగ్స్ మొత్తముల చెల్లింపు:

 ఉద్యోగి సర్వీసులో వుండి మరణిస్తే అతని సభ్యత్వ గ్రూపును బట్టి ఎంత రుసుం చెల్లిస్తున్నారో అన్ని వేల రూపాయలు చొప్పున ఇన్స్యూరెన్స్ మొత్తంతోపాటు సేవింగ్స్ మొత్తం కూడా 10 శాతం
వడ్డీతో సహా చెల్లిస్తారు. ఉద్యోగి రిటైరు అయినా లేక రాజీనామా చేసినా సేవింగ్స్ మొత్తాన్ని మాత్రమే 10 శాతం వడ్డీతోకలిపి చెల్లిస్తారు.  01.11.1994 నుండి వడ్డీ 12% నకు పెంచబడినది. వడ్డీ 01.04.2000 నుండి 11%కు 01.04.2001నుండి 9.5%కు 01.04.2002 నుండి 9%కు 01.11.2004 నుండి 8%, 01.12.2011 నుండి 8.6%గానిర్ణయించ బడింది. ఉద్యోగి 7 సం||లపాటు కన్పించకుండా పోయిన సందర్భంలో ఆ కాలమునకు ఇన్స్యూరెన్స్ కవరు ప్రీమియంలను వడ్డీతో సహా మినహాయించి ఇన్స్యూరెన్స్ మొత్తము + సేవింగ్స్ మొత్తము చెల్లించబడును.    

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top