లాక్‌డౌన్‌ తర్వాత పది పరీక్షలు - నష్టపోయిన రోజులను తరువాత ఏడాది సెలవు రోజులను కుదించి అదనంగా క్లాసులు నిర్వహించనున్నారు

▪️రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ ప్రభావం విద్యా సంస్థలపై ఎక్కువగా ఉందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

▪️ రాష్ట్రంలో ఉన్న 90 లక్షల విద్యార్థుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

▪️ 10వ తరగతి పరీక్షలు లాక్‌డౌన్ తరువాత నిర్వహిస్తామని, ఇందుకోసం వారికి ఆన్‌లైన్ క్లాసులు చెప్పిస్తున్నామని తెలిపారు.

▪️దూరదర్శన్‌ ద్వారా ఈ క్లాసులకు 5 లక్షల మంది హాజరవుతున్నారని చెప్పారు.

▪️నేటి నుంచి ఎఫ్‌ఎం, రేడియో ద్వారా కూడా క్లాసులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

▪️ ఇక అన్ని యూనివర్శిటీల్లోని మిగిలిన సిలబస్‌ను ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 ▪️ యూనివర్శిటీల మిడ్‌ ఎగ్జామ్స్‌ను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చామని తెలిపారు.

▪️ వచ్చే విద్యా సంవత్సరంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇప్పుడు నష్టపోయిన రోజులను తరువాత ఏడాది సెలవు రోజులను కుదించి అదనంగా క్లాసులు నిర్వహించి కవర్‌ చేస్తామని పేర్కొన్నారు.

▪️అన్ని ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా వేశామని చెప్పారు.


▪️ఆన్‌లైన్‌లోనే గేట్‌ కోచింగ్‌ను కూడా ఇవ్వాలని నిర్ణయించామని, విద్యార్థులు ఎవరూ ఖాళీగా ఉండకుండా ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top