కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు1 జనవరి 2020 నుండి 30, 2021జూన్ వరకూ DA, DR రద్దు.

 లాక్‌డౌన్ ఎఫెక్ట్: కేంద్రం మరో కీలక నిర్ణయం

★ లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

★ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ పెంచరాదని నిర్ణయం తీసుకుంది.

★ జనవరి ఒకటి నుంచి పెండింగ్ ఉన్న మొత్తాన్ని కూడా చెల్లించరు. దీని ప్రకారం 2021 జులై వరకూ డిఏ, డీఆర్ పెరగదు.

★ దేశ వ్యాప్తంగా మార్చి 24 అర్ధరాత్రి నుంచి ఏప్రిల్ 14 వరకూ తొలి విడత లాక్‌డౌన్ కొనసాగగా రెండో విడత లాక్‌డౌన్ మే 3 వరకూ కొనసాగనుంది.

★ ఈ నేపథ్యంలో దేశమంతా లాక్‌డౌన్‌లో ఉంది. అన్ని రంగాలూ మూతపడ్డాయి. ఆర్ధిక వ్యవస్థ కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని నిపుణులు సూచిస్తున్న తరుణంలో డిఏ పెంచరాదని కేంద్రం నిర్ణయించింది.

★ ఆర్ధిక రంగానికి సంబంధించి కేంద్రం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధించారు.

     
    
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top