పాఠశాలలకు నేరుగా నిధులు జమ
★ జిల్లాలో ఇప్పటి వరకు పీడీ ఖాతాల్లేక నిధులు జమ కాకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రధానోపాధ్యాయులకు కాస్త ఊరట లభించింది. పీడీ ఖాతాలు లేకుంటే పాఠశాలలకు నేరుగా జమ చేయాలని రాష్ట్ర ప్రాజెక్టు అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.
★ జిల్లాలో మొత్తం 241 పాఠశాలలకు నేరుగా నిధులు జమ కానున్నాయి. జిల్లాలోని 3,800 పాఠశాలలకు పాఠశాల నిర్వహణ నిధులు జమ చేయాల్సి ఉంది. ఇందులో 108 పాఠశాలలకు ఇప్పటి వరకు పాఠశాల నిర్వహణ నిధులు జమ చేయలేక పోయారు.
★ ఆ నిధులను జిల్లా ప్రాజెక్టు ఛైర్మన్ ఖాతాలో జమ చేసి అనంతరం కలెక్టరు ఆమోదంతో ఆయా పాఠశాలల ఖాతాలకు నిధులు జమ చేస్తారు. మొత్తం రూ.33 లక్షలు జమ చేయాల్సి ఉంది.
★ ఇప్పటి వరకు 483 పాఠశాలలకు మాత్రమే పీడీ ఖాతాలు ఉండటంతో ఆ మేరకు జమ చేశారు. పీడీ ఖాతాల్లేని మరో 133 పాఠశాలలకు జిల్లా ప్రాజెక్టు ఖాతా నుంచి రూ.40 లక్షలు పాఠశాలలకు జమ చేస్తారు.
ఈప్రక్రియ కొంత వేగంగా పూర్తి కావొచ్ఛు.
0 comments:
Post a Comment