కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 75 జిల్లాల్లో లాక్‌డౌన్ ప్రకటించాలని రాష్ట్రాలకు ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దిల్లీలో ఆ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా అత్యవసర సర్వీసులు మినహా అన్నింటినీ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాల మధ్య ప్రయాణ సర్వీసులు రద్దు చేయాలని, అత్యవసర రవాణా సేవలు మాత్రమే నడపాలని రాష్ట్రాలకు సూచించినట్లు చెప్పారు. రైలు ప్రయాణికుల ద్వారా కరోనా వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ఈ నెల 31వ తేదీ వరకు ప్రయాణికుల రైళ్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు
Download District Lists
0 comments:
Post a Comment