Bridge Course Day Wise Schedule బ్రిడ్జి కోర్సు నిర్వహణకు సర్వం సిద్ధం

బ్రిడ్జి కోర్సు నిర్వహణకు సిద్ధం

 జిల్లాలో బ్రిడ్జి కోర్సు నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. బేస్‌లైన్‌ (సామర్థ్య) పరీక్ష, తుది పరీక్ష ప్రశ్నపత్రాల్ని జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు అందించనుంది. విద్యార్థులకు వర్కు బుక్స్‌ను ఎస్‌సీఈఆర్టీ సిద్ధం చేస్తోంది. పిల్లలకు బ్రిడ్జి కోర్సుతోపాటు తల్లిదండ్రులకు ఆంగ్ల మాధ్యమంపై అవగాహన కల్పించేందుకు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన సమయసారణిని అధికారులు విడుదల చేశారు. కోర్సు నిర్వహణకు సంబంధించి ఉపాధ్యాయులకు దూర దృశ్య శ్రవణ గోష్ఠి పద్ధతి లేదా ముఖాముఖి శిక్షణ అందించనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అధికారులు కసరత్తు చేస్తున్నారు. డీసీఈబీ కార్యదర్శి పుప్పాల లలితామోహన్‌కు ఆంగ్ల మాధ్యమ కార్యనిర్వాహక సమన్వయకర్తగా, అంగలూరు ప్రభుత్వ డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వినయ్‌కుమార్‌కు బ్రిడ్జి కోర్సు నిర్వహణ తీరుతెన్నులు అంచనా వేసే బాధ్యతలు అప్పగించారు.

సమయసారిణి ఇదీ...


  1. ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు అసెంబ్లీ
  2. 8.30 నుంచి 9.15 గంటల వరకు రెయిమ్స్‌ తరువాత ఐదు నిమిషాలు విరామం ఇస్తారు. 
  3. 9.20 నుంచి 10.05 గంటల వరకు ఆటలు ఆడిస్తారు. పది నిమిషాల విరామం తరువాత 
  4. 10.15 నుంచి 11 గంటల వరకు రాత నైపుణ్యాన్ని పెంచడం, 
  5. 11 నుంచి 11.45 గంటల వరకు స్టోరీటైమ్‌, 
  6. 11.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు హాస్య సమయం (ఫన్‌టైమ్‌)గా కేటాయించారు.
      బేస్‌లైన్‌ పరీక్ష నుంచి తుది పరీక్ష వరకు, ఏరోజు ఏమేం నిర్వహించాలో షెడ్యూలు అందజేశారు. 23న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. బ్రిడ్జి కోర్సు పరీక్షల నిర్వహణకు డీసీఈబీ ప్రశ్నపత్రాలు సమకూరుస్తుందని కార్యదర్శి పుప్పాల లలితమోహన్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉత్సాహపూరిత వాతావరణంలో కోర్సు నిర్వహిస్తామన్నారు.

Bridge Course Day Wise Schedule

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top