రాష్ట్రంలో సెలవులపై త్వరలో నిర్ణయం
కరోనా విస్తృతి నేపథ్యంలో ఐదో తరగతి వరకు విద్యార్థులకు సెలవులివ్వాలన్న అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు సెలవులు ప్రకటించి వార్షిక పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించడంపై చర్చిస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు త్వరలో ముగియనున్నాయి. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను యథాతథంగా ఈనెల 31 నుంచి నిర్వహించడంపైనే అధికారులు మొగ్గు చూపారు. డిగ్రీ విద్యార్థులకు సెలవులిచ్చేందుకున్న సాధ్యాసాధ్యాలపై పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండే విద్యార్థులను పరీక్షల వరకు అక్కడే ఉంచాలన్న యోచనలో అధికారులున్నారు. వీరితోపాటు డేస్కాలర్ విద్యార్థులకు యథాతథంగా పరీక్షలు నిర్వహించాలని విశ్వవిద్యాలయాలు యోచిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు సోమవారంనుంచి ప్రారంభమైన బ్రిడ్జి కోర్సు కొనసాగింపుపై సమావేశంలో చర్చించారు. సీఎం జగన్‌తో చర్చించాక ఈ అంశాలపై అధికారిక నిర్ణయాలు వెలువడనున్నాయి.

0 comments:
Post a Comment