ఆంధ్రప్రదేశ్, పాఠశాల విద్యాశాఖ పై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి జగనన్న విద్యా కానుకలో ఆరు రకాల వస్తువులు. మూడుజతల యూనిఫారమ్స్, షూ, సాక్స్, బెల్టు, బ్యాగు, టెక్ట్స్ బుక్స్ నమూనాలను సీఎంకు విద్యాశాఖ అధికారులు చూపించారు.
డిజిటల్ విద్యాబోధనకై ప్రతి పాఠశాలకూ స్మార్ట్ టీవీలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో పాఠశాల విద్య ప్రధాన కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ ఐ.ఏ.ఎస్, పాఠశాల కమిషనర్, రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు ఐ.ఏ.ఎస్, పభుత్వ సలహాదారుడు శ్రీ ఆకునూరి మురళి, ఆంగ్ల మీడియం ప్రత్యేక అధికారిని శ్రీమతి వెట్రిసెల్వి, అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ ఆర్.మధుసూధన రెడ్డి, చీఫ్ ఇంజనీర్ శ్రీ శ్రీనివాసు రావు, డిప్యూటీ డైరెక్టర్ శ్రీ ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment