ANDHRA PRADESH INTIGRATED EDUCATIONAL RULES-1966) - ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషనల్ రూల్స్-1966

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషనల్  రూల్స్-1966:(ANDHRA PRADESH INTIGRATED EDUCATIONAL RULES-1966):

పాఠశాల నిర్వహణ-కొన్ని ముఖ్య విషయాలు:


 A.E.R Rule-46(A):

ప్రవేశ సం॥లో ఆగస్టు-31 నాటికి 5సం॥(5+) వయస్సు కలిగియున్న విద్యార్ధులను ఒకటో తరగతిలో చేర్చుకోవాలి.

 A.E.R-46(B):

అనుబంధం 10 ప్రవేశ దరఖాస్తు ద్వారా పాఠశాలలో విద్యార్ధులను చేర్చుకోవాలి.*

 A.E.R Rule 42(C):

ఒక విద్యా సం॥లో పాఠశాల ఖచ్చితంగా 220 పనిదినాలు కలిగియుండాలి.*

 A.E.R.-46(J):

పాఠశాలను విడిచి వేరొక పాఠశాలకు పోవునపుడు,వేరొక పాఠశాల నుండి ఈ పాఠశాలలో చేరినపుడు రికార్డు షీటు నిర్వహించాలి.

 A.E.R-45:

ఒక నెలరోజులు దాటిననూ,సెలవు లేకుండా పాఠశాలకు హాజరుకాని విద్యార్ధులను పాఠశాల రోలు నుండి తొలగించవచ్చును.

A.E.R-35:

విద్యార్ధుల హాజరును, ఉదయము, మధ్యాహ్నం మొదటి పీరియడ్ ఆఖరున పుర్తిచేయాలి.

 A.E.R Rule123(B):

ఉపాధ్యాయుల హాజరుపట్టిని అనుబంధం-4 ఫారాలున్న పేజీలనువాడాలి.

 A.E.R-33:

ప్రధానోపాధ్యాయులు విద్యా సం॥ ప్రారంభంలోనే పాఠశాల సిబ్బంది యొక్క రోజువారీ కార్యక్రమాలను "జనరల్ టైం టేబుల్" ద్వారా తెలియజేయాలి.ఆఫీస్ రూంలోనూ,ప్రతి తరగతి గదులోనూ టైం టేబుల్ ను వ్రేలాడదీయాలి.

 Rc.No.527/E2/97,Dt:16-07-1997:

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహోపాధ్యాయులు,ఇతర సిబ్బంది తప్పనిసరిగా అసెంబ్లీ(Prayer) కు హాజరుకావాలి.లేట్ పర్మిషన్లు ఉపాధ్యాయులకు వర్తించవు.

 A.E.R Rule 77:

  ప్రతి ఉపాధ్యాయునికి కనీసం 24 పీరియడ్లు కేటాయించాలి.

 A.E.R Rule 99:

విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి T.C పై ప్రవేశము కోరు విద్యార్థులు వారు చేరే జిల్లా విద్యాశాఖాధికారి గారి కౌంటర్ సిగ్నిచర్ విధిగా ఉండవలెను.

 A.E.R Rule 124(A):

అడ్మిషన్ రిజిస్టరుకు ప్రతి పేజీకి నెంబరు తప్పనిసరిగా వేయాలి. సీరియల్ నెంబరును చిన్న స్కూళ్లకు 5 సంవత్సరముల కు ఒకసారి, పెద్ద స్కూళ్లకు 3 సంవత్సరములకు ఒకసారి సంఖ్య పెద్దదై అసౌకర్యముగా ఉంటే మార్చుకోవాలి.

 ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ లోకల్,నాన్ లోకల్ నిర్ణయించు విధానం:

స్కూల్ స్టడీ 7 సంవత్సరములలో ఏ జిల్లాలో ఎక్కువ కాలం చదివితే దానినిబట్టి లోకల్,నాన్ లోకల్ నిర్ణయిస్తారు.

ఒక వ్యక్తి 10వ తరగతి వరకు వేరే జిల్లాలో చదివితే అతను సొంత జిల్లాలో నాన్ లోకల్ గా పరిగణించబడతారు

ఎక్కడా చదవకుండా ప్రయివేటుగా పరీక్ష వ్రాస్తే ఎక్కడ నివాస సర్టిఫికెట్ చూపిస్తే ఆ జిల్లాకు లోకల్ అవుతారు.

2 లేదా 3 జిల్లాల్లో చదివితే 7 సంవత్సరాలలో ఎక్కువ కాలం ఏ జిల్లాలో ఉంటే అదే లోకల్ అవుతుంది.

రెండు జిల్లాలోనూ సమానంగా 3+3 ఉంటే చివరి 3 సంవత్సరాలు చదివిన జిల్లాయే లోకల్ అవుతుంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top