కేంద్ర ప్రభుత్వ పింఛను వ్యవహారాల శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 16 వేల మంది ఉపాధ్యాయులకు ఊరట కలిగించనున్నాయి. వారికి పాత పింఛన్ పథకం వర్తించనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 జనవరి 1 నుంచి సీపీఎస్ అమల్లోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2004 జనవరి 1వ తేదీ తర్వాత నియామకమైన ఉద్యోగులకూ పాత పింఛన్ పథకం వర్తిస్తుంది. అయితే సదరు నియామకాలకు సంబంధించిన పరీక్ష ఫలితాలు 2004 జనవరి 1వ తేదీ కంటే ముందు ప్రకటించి ఉండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 సెప్టెంబరు 1వ తేదీ నుంచి సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చింది. ఆ ప్రకారం 2004 సెప్టెంబరు 1 నుంచి నియామకమైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీపీఎస్ వర్తిస్తుంది. కాగా 2003 డీఎస్సీ నియామకాలు 2005 నవంబరులో జరిగాయి. ఫలితాలు మాత్రం 2004 జులై నెలలోనే ప్రకటించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సీపీఎస్ విధానం అమల్లోకి రాకముందే 2003 డీఎస్సీ ఫలితాలు ప్రకటించినందున వారికి పాత విధానం అమలు చేయాల్సి ఉంటుందని టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రతాపరెడ్డి, పీఆర్‌టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డిలు తెలిపారు. ఆ డీఎస్సీ ద్వారా రెండు రాష్ట్రాల్లో 16,449 మంది ఉపాధ్యాయులు నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు.
Good News: 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛను విధానం

0 comments:
Post a Comment