ఇంగ్లీషు మీడియమే రిఫరెండం
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనకు మద్దతుగా 43 వేలకుపైగా పేరెంట్స్ కమిటీలు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. ప్రభుత్వ నిర్ణయానికి ఇదే రిఫరెండం అని మంత్రి స్పష్టం చేశారు. బుధవారం సచివాలయం వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇంగ్లీషు మీడియానికి అనుకూలంగా పేరెంట్స్ కమిటీలు చేసిన తీర్మాన ప్రతులను ట్రంక్ పెట్టెల్లో తెచ్చి మీడియాకు చూపించారు.
ఆంగ్ల మాధ్యమ బోధనపై సీఎం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతించారనేందుకు ఈ తీర్మాన ప్రతులే నిదర్శనమని మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లాలో 99.76ు పేరెంట్స్ కమిటీలు, చిత్తూరు జిల్లాలో 99ు కమిటీలు ఇంగ్లీషు మీడియానికి మద్దతుగా తీర్మానాలు చేసి పంపించాయన్నారు. కుప్పం మండలంలోని 140 పాఠశాలల పేరెంట్స్ కమిటీలు 100ు అనుకూలంగా తీర్మానించాయని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, పబ్లిక్ ఫోరాలు హర్షిస్తూ తీర్మానం చేశాయని తెలిపారు.

0 comments:
Post a Comment