ఆదాయ పన్నుపాత విధానమే లాభదాయకం

ఆదాయపు పన్నులో ప్రయోజనాలు కల్పించి ఊరటనిస్తారన్న ఆశ ఈ బడ్జెట్‌తో నెరవేరలేదు. దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను విషయంలో కూడా ఎలాంటి ఊరట కల్పించలేదు. కొత్త, పాత పన్ను శ్లాబుల ప్రకారం రూ.2.50లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.ఐదు లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10శాతం పన్ను చెల్లించాలి. రూ.7.50 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15శాతం చెల్లించాలి. గతంలో ఈ రెండు శ్లాబులు కలిపి ఉండేవి. పైకి చూస్తే ఇది లాభదాయకంగా కనబడుతోంది. కొత్త విధానంలో ఎటువంటి మినహాయింపులు తీసుకోవడానికి వీల్లేదు. వేతన జీవులు కొత్త విధానానికి వెళితే.. రూ.10 లక్షల ఆదాయం ఉన్న ఓ ఉద్యోగి సాధారణంగా సెక్షన్‌ 80సీ ప్రకారం.. రూ.లక్షా 50వేల వరకు మినహాయింపు పొందొచ్చు. సెక్షన్‌ 24 ప్రకారం గృహ రుణ వడ్డీపై రూ.2లక్షల వరకు, సెక్షన్‌ 80డీ ప్రకారం ఆరోగ్య బీమాపై చెల్లించే ప్రీమియంపై రూ.25వేల వరకు మినహాయింపు కల్పించారు. సెక్షన్‌ 80సీ(డీడీ) కింద ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెడితే రూ.50వేల వరకు మినహాయింపు లభిస్తుంది. ఇక వేతన జీవుల స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ.50వేల వరకు మినహాయింపు ఉంది. ఇవన్నీ కలిపితే దాదాపు రూ.4.75లక్షలపై మనకు మినహాయింపు లభిస్తుంది. రూ.10 లక్షల ఆదాయం ఉన్నవారికి పాత విధానం ప్రకారం.. పైన చెప్పిన మినహాయింపులన్నీ వర్తిస్తే పన్ను విధించే మొత్తం కేవలం రూ.5.25లక్షలు మాత్రమే ఉంటుంది. ఇక ఈ మొత్తంపై దాదాపు రూ.17,500 పన్ను కడతాం. విద్యా సెస్సు రూ.700తో కలిపి రూ.18,200 మాత్రమే పన్ను చెల్లిస్తాం. అదే కొత్త విధానంలో రూ.10లక్షల శ్లాబులోకి వచ్చేవారు.. దాదాపు రూ.78వేల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.59,800 అదనంగా పన్ను కట్టాలి''

''ఇక పాత విధానం ప్రకారం మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నాలుగు సంవత్సరాల్లో రెండుసార్లు లీవ్ ట్రావెల్‌ అలవెన్స్‌, హెచ్‌ఆర్‌ఏ, విద్యా రుణం, విరాళాలు ఇలా మరికొన్ని మినహాయింపులు కూడా పొందొచ్చు. వీటన్నింటిని కలుపుకొంటే రూ.7.5లక్షలు-రూ.10లక్షల శ్లాబులోకి వచ్చేవారు ఒక్క రూపాయి పన్ను కట్టాల్సిన అవసరం రాకపోవచ్చు. ఇదే తరహాలో రూ.12.50లక్షల ఆదాయం ఉన్నవారు కొత్త విధానంలో రూ.1.30లక్షల పన్ను చెల్లిస్తే.. పాత విధానం ప్రకారం.. మినహాయింపు సొమ్ము రూ.4.75లక్షలు తీసివేస్తే రూ.7.75లక్షల పైన రూ.59,800 కట్టాల్సి ఉంటుంది. అంటే కొత్త విధానంలో అదనంగా రూ.70,200 చెల్లించాలి. ఇంకా పాత విధానంలో హెచ్‌ఆర్‌ఏ, ఎల్‌టీఏ, సెక్షన్‌ 80జీ, సెక్షన్‌ 80ఈ, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ అలవెన్స్‌ డిడక్షన్‌ ఇవన్నీ కలిపితే పన్ను ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి రూ.12.50లక్షల ఆదాయం ఉన్న వరకు కొత్త విధానం ఏమాత్రం లాభదాయం కాదు'' అని చెప్పుకొచ్చారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top