టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు వస్తాయా..? ఇందులో నిజమెంత..?

▪️టమాటాలను తినడం వల్ల కిడ్నీ స్టోన్లు  అవకాశం ఉంటుంది కానీ అది చాలా తక్కువ శాతం మాత్రమే. అసలు కిడ్నీ స్టోన్లు రాని వారు నిర్భయంగా టమాటాలను రోజూ తినవచ్చు.

▪️ఇక కిడ్నీ స్టోన్లు వచ్చిన వారు, ఇతర కిడ్నీ సమస్యలు ఉన్నవారు.. మళ్లీ స్టోన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కనుక టమాటాల వినియోగం తగ్గించాలి.

▪️దీంతో మళ్లీ స్టోన్లు రాకుండా చూసుకోవచ్చు. అంతేకానీ.. అసలు కిడ్నీ సమస్యలు లేనివారు, స్టోన్లు అసలు రాని వారు టమాటాలను తీసుకోవచ్చు.

▪️ వాటిని తీసుకోవడం మానేయాల్సిన పనిలేదని పరిశోధకులు చెబుతున్నారు.

▪️సాధారణంగా కిడ్నీ స్టోన్లు మినరల్స్‌, ఆగ్జలేట్స్‌, కాల్షియం, యూరిక్‌ యాసిడ్‌ నిల్వలు పేరుకుపోవడం వల్ల ఏర్పడుతాయి.

▪️అయితే కిడ్నీ స్టోన్లు ఓవర్‌నైట్‌లో తయారు కావు. అవి ఏర్పడేందుకు చాలా కాలం పడుతుంది.

▪️ అయితే కిడ్నీ స్టోన్లు వచ్చిన వారు మళ్లీ అవి రాకుండా ఉండేందుకు గాను కచ్చితమైన డైట్‌ను పాటించాలి.

▪️అందులో భాగంగానే వారు టమాటాలు, పాలకూర వంటి పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి. దీంతో మళ్లీ కిడ్నీ స్టోన్లు రాకుండా చూసుకోవచ్చు.

▪️ ఇక అసలు స్టోన్స్‌ సమస్య లేనివారు ఏ పదార్థాలనైనా నిర్భయంగా తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు..!
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top