Leaves: అనుమతి లేని గైర్హాజర్ (డైస్ నాన్)

అనుమతి లేని గైర్హాజర్ (డైస్ నాన్)


  1.  ఉద్యోగులు సంబంధిత అధికారి నుండి ఎలాంటి పూర్వానుమతి లేకుండా, లేక కనీసం సెలవు దరఖాస్తు పెట్టకుండా గర్హాజర్ అయిన కాలాన్ని ఫండమెంటల్ రూల్ FR-18 ప్రకారం డైస్ నాన్(Dies-Non) గా పరిగణిస్తారు.
  2. డైస్ నాన్ అంటే No work-No pay పని చేయలేదు కాబట్టి జీతం లేదు అని అర్ధం.
  3. డైస్ నాన్ కాలాన్ని సర్వీస్ బ్రేక్ గా పరిగణించకూడదు.
  4. కాని అట్టి డైస్ నాన్ కాలము తదుపరి వార్షిక ఇంక్రిమెంటుకు గాని, పెన్షనుకు గాని, సెలవుకు గాని పరిగణలోకి తీసుకోరు.
  5. ఉద్యోగిపై CCA రూల్స్-1991 ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకోబడతాయి.
  6. ఒక సంవత్సరం మించి విధులకు గైర్హాజరైన ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించాలని G.O.Ms.No.11 Fin తేది:13.01.2004 ద్వారా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
  7. ఒక సంవత్సరం మించి విధులకు గైర్హాజరైన ఉద్యోగి రాజీనామా చేసినట్లు పరిగణించాలని రూలు 18 కి సవరణ ఉత్తర్వులు G.O.Ms.No.128 Fin తేది:1.6.2007 వెలువడ్డాయి.
  8. పై సందర్భంలో ఉద్యోగిపై చర్యలు తీసుకునేముందు ఆ ఉద్యోగి వాదనను వినిపించుకొనుటకు తగిన అవకాశం ఇవ్వవలెను. Rule 5B & G.O.Ms.No.129 Fin తేది:1.6.2007
  9. విధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ పరిస్థితుల్లో నైనా రాజీనామా చేసిన యెడల A.P.Subordinate Service రూల్స్ 1996 లోని రూలు 39 ప్రకారం. ఆమోదించవచ్చు.
  10. విధులకు గైర్హాజరైన ఉద్యోగి ఏ కారణం చేతనైనా A.P.రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 లోని 43 మరియు 44 మేరకు స్వచ్చంద పదవీ విరమణ చేయదలచుకున్న నిబంధనల మేరకు అనుమతించవచ్చు.
  11. విధులకు అనుమతి లేకుండా గైర్హాజరైన ఉద్యోగి తిరిగి కొంతకాలం తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన సందర్భంలో తిరస్కరించకుండా, వెంటనే విధులలో చేర్చుకోవాలి. తదుపరి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.Govt.Circular.Memo.No.C.9101-4/8/FR-I/91 తేది:25.12.1991.
  12. వివిధ తప్పిదాల వల్ల సర్వీసు నుండి డిస్మిస్ కాబడిన ఉద్యోగి మొత్తం సర్వీసు కోల్పోతాడు. పెన్షనరీ బెనిఫిట్స్ రావు (రూలు-24) అయితే రూలు-40 ప్రకారం కాంపెన్సెట్ అలవెన్స్,రిటైరై ఉంటే వచ్చు పెన్షన్, గ్రాట్యుటీ లో 2/3 వంతు,పెన్షన్ లేదా గ్రాట్యుటీ లేదా రెండు గానీ ప్రత్యేక పరిస్థితులలో చెల్లిస్తారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top