టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ..ఎలక్ట్రిక్‌ టూవీలర్‌

 టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ..ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. శనివారం ఇక్కడ ఐ క్యూబ్‌ పేరుతో తమ తొలి ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాన్ని ఆవిష్కరించింది. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యోడ్యురప్ప, కేంద్ర రవణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా ఐక్యూబ్‌ మార్కెట్‌కు పరిచయమైంది. బెంగళూరులో దీని ఆన్‌ రోడ్‌ ధర రూ.1.15 లక్షలుగా ఉన్నది. 4.4 కిలోవాట్ల ఎలక్ట్రిక్‌ మోటర్‌ కలిగిన ఈ టూవీలర్‌ గరిష్ట వేగం గంటకు 78 కిలోమీటర్లు. కేవలం 4.2 సెకండ్లలో గంటకు 0 నుంచి 40 కిలోమీటర్లు వేగాన్ని అందుకోగలదని సంస్థ చైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌ తెలిపారు. పర్యావరణరహిత వాహనాలతో యువతను ఆకట్టుకునే దిశగా వెళ్తున్నామన్నారు

ఇక ఒక్కసారి పూర్తిస్థాయిలో చార్జింగ్‌ చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అని తెలిపారు.
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top