గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16207 పోస్టులను భర్తీచేసేందుకు నోటిఫికేషన్‌

గ్రామాల్లో 14,061.. వార్డుల్లో 2146 పోస్టులుచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16207 పోస్టులను భర్తీచేసేందుకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. వీటిలో 14,061 పోస్టులు గ్రామ సచివాలయాల్లో, 2146 పోస్టులు వార్డు సచివాలయాల్లో భర్తీచేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో శనివారం నుంచి ఈ నెల 31 వరకూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది*.

గ్రామ సచివాలయాల్లో..


పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌-5)-61 పోస్టులు, గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్‌-2)-246, ఏఎన్‌ఎం/ఎంపీహెచ్‌ఎ్‌స(మహిళలు)(గ్రేడ్‌-3)-648, విలేజ్‌ ఫిషరీస్‌ అసిస్టెంట్లు-69, విలేజ్‌ హార్టీకల్చర్‌ అసిస్టెంట్‌-1782, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2)-536, విలేజ్‌ సెరికల్చర్‌ అసిస్టెంట్‌ 43, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి-762, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2)-570, పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్‌-6) డిజిటల్‌ అసిస్టెంట్లు 1134, విలేజ్‌ సర్వేయర్‌ (గ్రేడ్‌-3) 1255, వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌-97, పశుసంవర్థక అసిస్టెంట్లుగా 6,858 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చింది.*

పట్టణ స్థానిక సంస్థల్లోని వార్డు సచివాలయాల్లో


వార్డు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ-105, ఎమినిటీస్‌-371, శానిటేషన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌- 513, ఎడ్యుకేషన్‌ అండ్‌ డేటా ప్రాసెసింగ్‌- 100, ప్లానింగ్‌ అండ్‌ రెగ్యులేషన్‌- 844, వెల్ఫేర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెక్రటరీలుగా 213 పోస్టులను భర్తీ చేయనుంది. ఇతర వివరాలు గ్రామ, వార్డు సచివాలయ వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొంది.
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top