Jagananna Amma Vodi Payment Status

Edit option at school level*

మండల విద్యాశాఖ అధికారులు , అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులు జగనన్న అమ్మ ఒడికి సంబంధించి క్రింది విషయాలు గమనించగలరు

*జగనన్న అమ్మ ఒడి అర్హులైన తల్లి/  సంరక్షకుల జాబితాలో ఉండి నగదు బదిలీ ( BANK A/C , IFSC CODE తప్పు గా నమోదు అయి) జరగని వారి పేర్లు పాఠశాల లాగిన్ లో కలవు.

ప్రధానోపాధ్యాయులు తల్లి/ సంరక్షకుల బ్యాంకు ఖాతాలు, IFSC CODE వివరాలు సరి చేయవలసిందిగా కోరడమైనది.

బ్యాంకు పాస్ బుక్ పోస్ట్ పేజీ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది

Steps to Update Account Details:


HM లాగిన్ చేసిన తరువాత.                           
                
 services పై క్లిక్ చేయండి.
       అకౌంట్ failure లిస్ట్ open అవుతుంది. 
       చివర అప్డేట్ account details పై క్లిక్ చేయండి.
         
  New account number enter చేయండి. 
  Pass book first page,last transaction page scan చేసి అప్లోడ్ చేయండి.

పై విషయాన్నీ అన్ని యాజమాన్యాల  ప్రధానోపాధ్యాయులకు తెలియజేయవలసినదిగా కోరడమైనది



జగనన్న అమ్మ ఒడి అర్హులైన తల్లి సంరక్షకుల జాబితాలో నగదు బదిలీ గురించి *CFMS* ద్వారా తెలుసు కోవడం.

Steps to Know the Payment Status:

➡ citizen services
➡ Expenditure links
➡ Beneficiary search
➡ Search by Aadhar
 Beneficiary  code తీసుకోవాలి.

మరల expenditure links లో beneficiary  account statement tab click చేయాలి

Beneficiary code మరియు date submit చేసి display click చేయవలెను.

తల్లి/ సంరక్షకులు bill status తెలుస్తోంది.


జగనన్న అమ్మ ఒడి పథకం లో తల్లి బ్యాంకు ఖాతా లో డబ్బులు వేయడం జరిగింది

Please check your accounts through below link...






Social Welfare Department – Administrative sanction for Rs.12,71,17,95,000/- for implementation of the scheme of Amma Vodi – Orders – Issued GO Rt.5 DT:4.1.20 


మండల విద్యాశాఖ అధికారులు మరియు  ఎం‌ఆర్‌సి సిబ్బంది అందరికీ అమ్మ ఒడి పథకం సూచన.
అమ్మ ఒడి పథకం కింద రెండు , మూడవ .జాబితాలో వచ్చిన తల్లి  లేదా సంరక్షకుని  వివరాలు క్షేత్ర స్థాయి పరిశీలన ద్వారా పంపించినవి.  వాటిని ఎవరైనా ఈ పథకం కింద అర్హులమని గాని లేదా తమ పేర్లు జాబితాలో చోటు చేసుకోలేదని కానీ, వారి వివరాలలో తగిన ధ్రువపత్రాలను సేకరించి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో 5-1-2020 సాయంకాలం 5 గంటల లోపు అందజేయాలి.
ఈ విధంగా అందజేసిన అర్హులైన ప్రతి ఒక్క తల్లి లేదా సంరక్షకులు ఈ కార్యక్రమం కింద తప్పనిసరిగా లబ్ధి పొందగలరు అని రాష్ట్ర కార్యాలయం తెలియజేసింది.
కాబట్టి జనవరి 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు మన౦ వివరాలు అప్లోడ్ చేయుటకు  తుది సమయం . కాబట్టి ప్రతి మండల విద్యాశాఖ తమ పరిధిలోని  సిబ్బందితో సమన్వయం చేసుకొని ఈ తదుపరి కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేసి మరియు అప్లోడ్ చేయవలసి ఉన్నది. 
రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన జగన్ అమ్మ ఒడి అర్హతలు దారిద్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లి లేదా సంరక్షకులు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు ఎకౌంటు మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ కలిగి ఉండాలి .
తెల్ల రేషన్ కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద లేదా అర్హత కలిగిన కుటుంబాలకు చెందినవారు అవునో కాదో ఆరు అంకెల పరిశీలన ద్వారా అర్హతను నిర్ణయించి కూడా లబ్ధి చేకూరుతుంది.
స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశాలలో చదువుతున్న ఆడపిల్లల మరియు వీధి బాలలకు ఈ పథకం వర్తిస్తుంది .
అర్హత కలిగిన తల్లుల లేదా సంరక్షణ పిల్లల కనీస హాజరు డెబ్భై అయిదు శాతం పరిశీలించి ధృవీకరించు కావాల్సి ఉంటుంది.
ఒక తల్లి కి ఎంతమంది పిల్లలు ఉన్నా తో సంబంధం లేకుండా ఏ తల్లిని లేదా సంరక్షకుని మాత్రమే లబ్ధిదారులుగా గుర్తిస్తారు . 
కొత్త రేషన్ కార్డు పొందడానికి నూతన అర్హతలు అమ్మవొడికి కూడా ఉంటాయి.  అవి క్రింది విధంగా ఉన్నాయి .
ఆదాయ పరిమితి : నెలవారి ఆదాయం గ్రామాలలో  10000,  అర్బన్ ప్రాంతాల్లో 12,000.
కుటుంబం యొక్క మొత్తం ల్యాండ్ హోల్డింగ్ (భూమి కలిగి ఉండటం) : ( ఈ రాష్ట్రం మొత్తం ఒకే క్రైటీరియా తీసుకోబడుతుంది) :  మాగాణి భూమి మూడు ఎకరాలు కన్నా తక్కువ ఉండాలి,  మెట్ట భూమి 10 ఎకరాలు కన్నా తక్కువ ఉండాలి,  ఈ రెండూ కలిపి కూడా 10 ఎకరాలు కన్నా ఎక్కువ ఉండరాదు.
ఎలక్ట్రిసిటీ వినియోగం (విద్యుత్ వినియోగం):  ఒక కుటుంబము యొక్క విద్యుత్ వినియోగం 6 నెలల  యావరేజ్ గా తీసుకున్నప్పుడు నెలకు  300 యూనిటీ ల కన్నా తక్కువ ఉండవలెను .
అన్ని ప్రభుత్వ  ఉద్యోగస్తులు మరియు పెన్షనర్స్ కు ఈ పథకం వర్తించదు.
నాలుగు చక్రాల వాహనం ఉన్న వారికి ఈ పథకం వర్తించదు.
ఈ పథకంలో టాక్సీ ట్రాక్టరు మరియు ఆటో ఉన్నవారిని మినహాయింపు ఉంటుంది .
ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు.
మున్సిపల్ ఏరియాలో 750 స్క్వేర్ ఫీట్  కన్నా తక్కువ ఆస్తి కలిగి ఉన్నవారికి మాత్రమే పథకాన్ని కూడా వర్తిస్తాయి.
కొత్త రేషన్ కార్డు నిమిత్తము  కుటుంబాలకి అర్హత ఉద్దేశించబడింది అవే అమ్మ ఒడి పథకానికి కూడా వర్తిస్తాయి.
List-2 required re verification లో supporting documents తీసుకోనే విధానము :
List-2&3ల లో ఏవైనా grievances ఉంటె 04.01.2020 సాయంత్రము 5 లోపు MRC లో submit చేయవలెను. ఆ తరువాత వచ్చినవి అనుమతించబడవు. కావున ఏ రోజుకారోజు grievances MRC లో submit చేయవలెను
ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.
1. Electricity ఎలక్ట్రిసిటీ వినియోగం (విద్యుత్ వినియోగం):  : ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి
a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి. 
b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి. అసలు కరెంట్ లేకపోతే సంబంధిత అధికారి నుండి కనెక్షన్ లేదనే ధృవీకరణ పత్రము అప్లోడ్ చేయాలి.
2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.
3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
4. Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా (ఈ లిస్ట్ లో టాక్సీ ట్రాక్టరు మరియు ఆటో ఉన్నవారిని వివరాలు ఉంటే ఆ వాహనం నంబరు ఫోటో తీసి ) లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి. .
5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
6. Land details: ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land: ...….. (విస్తీర్ణము)dry land: ....... (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు(భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి)తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి.
ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అని పొరపాటుగా నమోదుచేస్తే డిక్లరేషన్ మరియు వెరిఫికేషన్ పత్రాలు అప్లోడ్ చేయాలి.  
కావున ఈ విషయములో వెంటనే పై మార్గదర్శకాలు అనుగుణంగా  పని చేయవలసిందిగా కోరుచున్నాము.


SSA లో నెలకు ₹ 12000/- మించి తీసుకుంటున్న కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు.... అమ్మవడి కి అర్హతలేదని ఉత్తర్వులు..


  అమ్మ ఒడి ని విద్యా సంస్థల్లో అమలుపరుచుట పై CSE వారి సూచనలు..రోజూ వారి షెడ్యూల్.. Rc.242,Dt.2/1/2020

Download Copy

అర్. సి. నెంబర్:242/ఎ&ఐ/2019.
తేది:-31.12.2019.

❖ రెండు, మూడు జాబితా ల్లో ఉన్న వారిలో ఎవరైనా తాము అమ్మ ఒడి పథకానికి అర్హులమని  క్లైమ్  చేసుకొనేందుకు,పూర్తి వివరాలతో కూడిన సంబంధిత నకళ్లను అప్ లోడ్ చేయుటకు జిల్లా విద్యాశాఖాధికారుల మనవి మేరకు  వారం రోజుల సమయం (9.1.20) వరకు అవకాశం ఇవ్వడం జరిగినది.

:- కమీషనర్, పాఠశాల విద్యాశాఖ


మండల విద్యాశాఖ అధికారులు అందరికీ తెలియజేయునది ఏమనగా

 👉 విద్యార్థుల వివరాలు మార్పు చేసుకొనుటకు విద్యార్థులు చదువుతున్న మండలం లోను మరియు వాళ్ళ రెసిడెన్స్ మండలంలోనూ మార్పు చేసుకొనుటకు సదుపాయం కల్పించడం జరిగింది. 

👉 మార్పు కావలసినవారు వాళ్లు వినతిపత్రం సమర్పించ వలెను. మండల విద్యాశాఖ అధికారులు చూసి సదరు మార్పు మార్పులకు సంబంధించిన డాక్యుమెంట్ తల్లిదండ్రుల వద్ద తీసుకుని దానిపైన సంతకం చేసి లాగిన్ నందు అప్లోడ్ చేయవలెను. 

👉 ముందుగా పిల్లల యొక్క చైల్డ్ ఐడి ద్వారా సెర్చ్ చేసి  వాళ్ళ డీటెయిల్స్ వచ్చిన తర్వాత సంబంధిత డాక్యుమెంట్స్ చూసి ఎడిట్ చేసుకుని వాళ్ల సమర్పించిన వినతి పత్రం అప్లోడ్ చేయవలెను మరియు సంబంధిత డాక్యుమెంట్ ని సంతకాలు చేసి కూడా అప్లోడ్ చేయవలెను. 


ముఖ్య గమనిక ఏవైతే మార్పు సంబంధిత డాక్యుమెంట్స్ లేకుండా అప్లోడ్ చేస్తారో అది పరిగణలోకి తీసుకోవడం జరగదు.

గమనిక:ఎడిట్ ఆప్షన్ ఒక విద్యార్థి కి ఒకసారి మాత్రమే*

అమ్మఒడి పధకమునకు సంబందించి HM Login లో
1. Eligible in First List, 
2. List of Candidates who require further verification on given remarks 
3. Requires confirmation of given data 

అనే 3 అంశాల వారీగా రిపోర్ట్ వచ్చును. సదరు రిపోర్టుల యందు చూపించబడిన సంఖ్య పై క్లిక్ చేసినట్లయితే విద్యార్ధుల వివరములు చూపించ బడును. ఈ విధంగా మీ పాఠశాల యందు విద్యార్ధుల రిపోర్టు సరిచూసుకొన గలరు. 
ప్రధానోపాధ్యాయులు అందరూ సదరు రిపోర్టుల యందు ఏవైనా సవరణలు ఉన్న ఎడల విద్యార్ధుల యొక్క తల్లిదండ్రులను గ్రామ లేదా  వార్డు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ల వద్దకు మాత్రమే పంపించి ఈ క్రింది విధంగా వెరిఫికేషన్ చేయించుకొన వలసినదిగా తెలియజేయగలరు.

1. విద్యార్ధి తల్లి యొక్క రేషన్, ఆధార్, ఖాతా మరియు IFSC కోడ్ లకు సంబందించి సవరణలు ఉన్న ఎడల సవరణల దరఖాస్తు ఫారం తల్లిదండ్రుల వద్ద నుండి తీసుకొనవలెను.
2. ఆదాయపు పన్ను కట్టిన వారు అని వచ్చిన ఎడల తల్లిదండ్రుల వద్ద నుండి ధృవీకరణ పత్రం తీసుకోవలెను.
3. పొలం ఉన్నది అని వచ్చిన ఎడల సంబందిత వి.ఆర్.ఓ., దగ్గర నుండి పొలం లేదని ధృవీకరణ పత్రం తీసుకోవలెను.
4. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా అదనంగా ఉన్నది అని వచ్చిన ఎడల సదరు కరెంట్ ఆఫీసు నుండి గత  3 నెలల స్టేట్ మెంట్ లేదా 3 నెలల కరెంటు బిల్లుల నకలు కాపీలు తీసుకొనవలెను.
5. ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ అని ఉన్న ఎడల వారు సంబందిత ఉద్యోగి లేదా పెన్షనర్ కాకపోయినట్లు అయితే ఎడ్యుకేషన్ / డేటా ప్రొసెసింగ్ అసిస్టెంట్ లు ధృవీకరణ పత్రం తల్లిదండ్రుల వద్ద నుండి తీసుకొని జతపరచ గలరు
6. 4 చక్రముల వాహనములు ఉన్నాయి అని వచ్చిన ఎడల వాహనము లేదని ధృవీకరణ పత్రం లేదా వాహనము ఉన్న ఎడల టాక్సీ గా నడుపబడు చున్నట్లయితే వాహనము యొక్క సి బుక్ నకలు కాపీ జత చేయవలెను. ఒక వేళ వాహనము అమ్మినట్లయితే బదిలీ అయినట్లుగా నకలు కాపీ జత చేయవలెను.
7. Long Absentee, Migrated, Death అని వచ్చినట్లు అయితే సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుండి ధృవీకరణ పత్రం తీసుకొన వలెను.


Now The ammavodi eligibility list available in HM LOGIN⤵

మీ Dise కోడ్ తో ఒక్క క్లిక్ తో bank కవరింగ్ లెటర్ రెడీ.

నాడు నేడు కు ఎంపికైన స్కూల్స్ bank అకౌంట్ కోసం కవరింగ్ లెటర్ ను మీ స్కూల్ డైస్ కోడ్ తో ఈ క్రింది లింక్ నుండి పొందండి.

 ఎం.ఈ.ఓ కౌంటర్ సైన్ తో, కౌంటర్ సైన్ లేకుండా రెండు రకాలుగా లెటర్ ను ప్రింట్ తీసుకోవచ్చు.

https://www.eteachers.in/nadu-nedu



జగనన్న అమ్మఒడి - గ్రామపంచాయితి / పురపాలక వార్డు సామాజిక ఆమోద తీర్మాణము



జగనన్న -అమ్మవడి H.M.Login లో services నందు క్రొత్తగా update Mother/Guardian Address Mandal Form ఆప్షన్ ఇవ్వడం జరిగింది, గుర్తించగలరు.

Jagananna Ammavodi District Wise Pending List



*ప్రీవియస్ గా మనం డౌన్లోడ్ చేసిన అమ్మ ఒడి రిపోర్ట్స్ నందు అడ్రస్ పూర్తిగా లేకుండా , డిస్ట్రిక్ మాత్రమే డిస్ప్లే అయింది.

*ఇప్పుడు మీ యొక్క పాఠశాల క్లాస్ వైస్ రిపోర్ట్స్ (R-1 Class Wise MIS Report) నందు ,విద్యార్థుల యొక్క పూర్తి అడ్రస్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోగలరు.

*అలాగే కొన్ని పాఠశాలల విద్యార్థుల అడ్రస్ లు Other అని డిస్ప్లే అవుతుంది. అటువంటి విద్యార్థుల అడ్రస్ మార్పు చేయుటకు మాత్రమే సంబంధిత పాఠశాలల లాగిన్ నందు Update Mother/Guardian Address Mandal Form  అనే ఆప్షన్ ను Services అనే option లో enable చేయడం జరిగింది.

Form-1 గురుంచి (Ration Card ఉన్నవి):

*మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అడ్రస్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో (Dist,Mandal,Panchayat), ఆ మండలంలో మాత్రమే ఆ విద్యార్థి డేటా

అప్డేట్(మార్పు)చేయటానికి అవకాశం ఉంది (Mother/Guardian Details & Address).

Form-2 గురుంచి(Ration Card/Bank details లేనివి):


*మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి అడ్రస్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో (Dist,Mandal,Panchayat), ఆ మండలంలో మాత్రమే ఆ విద్యార్థి డేటా *అప్లోడ్* చేయటానికి అవకాశం ఉంది(Bank A/C Details).

* ఇప్పటికే విద్యార్థుల వివరాలు More than 90% సంబంధిత గ్రామ/వార్డు సచివాలయాలు నుండి వచ్చిన Form-1 కరెక్షన్స్ ద్వారా అప్డేట్ చేయడం జరిగింది.

* కావున ఉపద్యాయులందరు కూడా, మీ పాఠశాల లాగిన్ నందు ఉన్న క్లాస్ వైస్ రిపోర్ట్స్ ఒకసారి చెక్ చేసుకోగలరు.
* అలాగే ఈ రోజు నుండి Form-2 అనగా రేషన్ కార్డ్ లేని విద్యార్థుల వివరాలు అమ్మ ఒడి వెబ్సైట్ నందు ఎంట్రీ జరుగుతూ ఉంది.

*మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల అందరి వివరాలు అమ్మ ఒడి వెబ్సైట్ నందు కరెక్ట్ డీటెయిల్స్ తో నమోదు అయ్యాయో లేదో, ఒకసారి మీ పాఠశాల లాగిన్ నందు చెక్ చేసుకోగలరు.

జగనన్న అమ్మఒడి:-

👉 మండలంలోని ని ప్రభుత్వ  ప్రైవేట్ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు s1 form లో ఏమైనా  తప్పులు ఉంటే వెంటనే MRC సంప్రదించాలి.
👉s2 form వాలంటీర్లు పూర్తి చేసినట్లయితే అవి ఎం ఆర్ సి లో ఎంట్రీ అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలి.
👉 స్టూడెంట్ డబుల్ ఎంట్రీ ఉన్నట్లయితే వెంటనే MRC ని సంప్రదించి వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలి. డబల్ ఎంట్రీ ఉన్నట్లయితే వాటిని తొలగించకపోతే సంబంధిత ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
👉  తల్లిదండ్రులలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం ఉన్నట్లయితే
వారి విషయంలో కూడా తగు చర్యలు తీసుకోవాలి.
👉 ఒకే స్కూల్లో చదువుతున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ పిల్లలు ఉన్నట్లయితే వారి యొక్క బ్యాంకు డేటా ఒకే విధంగా ఉండేటట్లు చూసుకోవాలి.

ఫైనల్ డేటా సబ్మిట్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు


District Wise Amma Vodi Logins
Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top