అమ్మ ఒడి పథకం అర్హుల జాబితాలను బుధవారం సాయంత్రానికి పూర్తి

అమ్మ ఒడి  పథకం అర్హుల జాబితాలను బుధవారం సాయంత్రానికి పూర్తి చేయాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ వి.చినవీరభద్రుడు ఆదేశించారు

మంగళవారం గుంటూరు డీఈవో కార్యాలయం నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల విద్యాశాఖాధికారులతో ఆయన ఈ పథకంపై వీడియో సమావేశం ద్వారా సమీక్ష నిర్వహించారు. చినవీరభద్రుడు మాట్లాడుతూ ఏఒక్క పేద తల్లీ ఈ పథకంలో మిస్‌కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. ఆధార్‌ కార్డులేని, ఛైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదు కాని విద్యార్థులకు సంబంధించిన వివరాలు కూడా సేకరించాలని చెప్పారు. గడువు సమీపిస్తున్నందున అధికారులు కింది స్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ అమ్మఒడి పథకం జాబితాలను సిద్ధం చేసుకోవాలన్నారు.

డీఎస్సీ 2018లో అర్హత సాధించిన వారికి పోస్టింగ్‌ ఇచ్చేందుకు అన్ని జిల్లాల అధికారులు జాబితాలు సిద్ధం చేయాలని చెప్పారు.

 అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్‌లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top